అందుకే నిర్మాతగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘2 కంట్రీస్’ కథ తీసుకున్నాక పూర్తి కాన్ఫిడెన్స్ వచ్చిం ది. కానీ సునీల్‌తోనే చేస్తేనే బావుంటుందన్నారు. కానీ ఆయనకు మార్కెట్ లేదు. వేరే నిర్మాతను కలిస్తే, అమెరికాలో ఎందుకు బ్యాంకాక్‌లో చేద్దామన్నారు. అది నాకు నచ్చలేదు. అందుకే నేనే నిర్మాతగా మారాను అంటున్నారు దర్శకుడు ఎన్.శంకర్. మహాలక్ష్మి ఆర్ట్స్ పతాకంపై సునీల్, మనీషా రాజ్ జంటగా ఎన్.శంకర్ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘2 కంట్రీస్’ ఈనెల 29న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలు ఎన్.శంకర్ తెలుపుతూ..
వినోదాత్మకమైనదే
ఈ సినిమా మలయాళంలో పెద్ద హిట్. మాతృకలో ఎంటర్‌టైన్‌మెంట్ ప్రధానంగా వుంటుంది. మన తెలుగు ప్రేక్షకులు కూడా ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఎప్పుడూ ఆదరిస్తారు కనుక, నేను ఇప్పటిదాకా కానె్సప్టెడ్ ఓరియెంటెడ్ సినిమాలు చేశాను కనుక, ఆ సినిమాకు ఈ సినిమాకు మార్పు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నా.
చాలా గ్యాప్
జై బోలో తెలంగాణ తరువాత చాలా గ్యాప్ తీసుకుని చేసిన చిత్రం ఇది. మలయాళ నిర్మాత, దర్శకుడు, రచయిత నాకు మంచి స్నేహితులు. వారు ఫోన్ చేసి ఈ సినిమా పెద్ద హిట్ అయిందని చెప్పారు. షారుక్‌ఖాన్ వంటి స్టార్లు కూడా ఈ సినిమాను మెచ్చుకున్నారు. తెలుగులో నువ్వు చేస్తే బాగుంటుందని చెప్పడంతో గ్యాప్‌ను ఫుల్‌ఫిల్ చేయడానికి 2 కంట్రీస్‌ను రూపొందించా.
50 శాతం అమెరికాలో
మలయాళంలో ఈ సినిమాలో హీరోగా దిలీప్ చేశాడు. ఆ పాత్రకు సునీల్ ఖచ్చితంగా సరిపోతాడని, అతనికి టైలర్ మేడ్ పాత్ర ఇది అనుకున్నా. దీలీప్‌కు వున్న స్క్రీన్ ఇమేజ్ ఇక్కడ సునీల్‌కు వుం ది. కథ ప్రకారం సినిమా 50 శాతం అమెరికాలో చేయాలి. అందుకే న్యూయార్క్‌లో షూటింగ్ చేశా. అక్కడ స్థానికులనుండి అద్భుతమైన ఆదరణ లభించింది.
హైలెట్స్
మంచి సందేశం, ప్రేమ కలగలసి వినోదంతో రూపొందించిన చిత్రమిది. రాంప్రసాద్ కెమెరా పనితనం, గోపీసుందర్ సంగీతం, సునీల్ బాడీ లాంగ్వేజ్ అతని వయ స్సు, అతని స్క్రీన్ ఇమేజ్ ఈ సినిమాకు పెట్టని కోటలు. ఇవే హైలెట్స్ సినిమాలో. మరో హైలెట్ ఏమిటంటే మనీషారాజ్ కొత్త అమ్మాయి అయినా అద్భుతంగా చేసింది. ఆ పాత్ర కోసం అనేకమందిని చూశాం. మల్టీ ఎమోషన్స్ వున్న పాత్ర అవ్వడంతో ప్రొఫెషనల్ ఆర్టిస్టులు మాత్రమే చేయగలరు. అశ్లీలత, అసభ్యం ఏమీ వుండవు. అందుకే ఆ పాత్రలో మనీషారాజ్ లీనమై నటించింది. ఆమెకూడా ఓ హైలెట్.
పెద్ద మెదడు చిన్నమెదడు
కథ గురించి చెప్పాలంటే ప్రతి వ్యక్తికి చిన్నమెదడు, పెద్ద మెదడు వుంటుంది. వీటికెప్పుడూ ఓ సంఘర్షణ కూడా వుంటుంది. కథానాయకుడి పాత్రకు ఎలాంటి లక్ష్యం అనేది ఉండదు. అతనికి డబ్బు వుంటే చాలు. అందుకోసం ఏమైనా చేస్తాడు. సరదాగా సాగే అతడి జీవితంలోకి ఓ అమ్మాయి వచ్చి అతన్ని ఎలా మార్చింది, ఆమె ప్రేమకోసం ఏం చేశాడు? అనేదే భావోద్వేగంగా ఈ చిత్రంలో చర్చించాం. ఓ అర్థవంతమైన సినిమా చూశామని ప్రేక్షకులు సంతృప్తి చెందడం ఖాయం.
నెక్స్ట్ ప్రాజెక్టులు
కమల్‌హాసన్‌తో ఓ సినిమాకు అంతా సిద్ధమైంది. నిర్మాతలు వేరేవాళ్ళు. 2 కంట్రీస్ చిత్రాన్ని హిందీలో కూడా రీమేక్ చేస్తున్నాం. హిందీలో మేమే నిర్మాతలం. టి సీరిస్‌తోపాటు మరికొంతమందితో కలిసి ఈ చిత్రం రూపొందించనున్నాం. ఈ సినిమాలో అజయ్ దేవ్‌గన్ హీరోగా నటిస్తాడు.

- శ్రీ