కొత్తదనంతో మలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ సీనియర్ దర్శకుడు రవిరాజా పినిశెట్టి తనయుడు సత్యప్రభాస్ తండ్రి దారిలోనే దర్శకుడిగా మారాడు. ఆయన తొలిసారి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘మలుపు’ ఆది పినిశెట్టి, నిక్కీ గర్లాని జంటగా తెర కెక్కిన ఈ చిత్రం ఈ రోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు సత్యప్రభాస్ చెప్పిన విశేషాలు:
‘ఈ సినిమా ఆలస్యమవడానికి కారణం కథ ప్రకారం రియల్ లొకేషన్ల కోసం వెదకడం. మంచి సినిమా ప్రేక్షకులకు అందించాలి. చాలా టైం తీసుకొని ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నాం. దర్శకత్వంలో మాస్టర్ డిగ్రీ అమెరికాలో చేశాను. మొదటి సినిమా అనగానే అందరూ వెళ్లే దారిలో కమర్షియల్ సినిమా చేయాలని అనుకోలేదు. ప్రేక్షకులకు ఏదో కొత్తదనాన్ని అందించాలనే తపనతో ఈ సినిమా చేశాం. కథ విన్న తర్వాత నాన్న కూడా సపోర్టు అందించారు. ఇక ఈ సినిమాకి హీరోగా తమ్ముడు ఆదిని ఎంచుకోటానికి కారణం. తను రెగ్యులర్ కమర్షియల్ హీరోగా కాకుండా విభిన్న సినిమాల్లో నటిస్తూ తనదైన దార్లో వెళ్తున్నాడు. కాబట్టి నా కథకు తనే కరెక్ట్ అని భావించాను. ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ ఉండే ఈ సినిమా తప్పకుండా తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది’ అని అన్నారు.