మళ్లీ కమెడియన్‌గా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హాస్య నటుడిగా కెరీర్ ప్రారంభించి హీరోగా టర్న్ అయి నిలదొక్కుకున్న నటుడు సునీల్. మళ్లీ కమెడియన్‌గా నటించడానికి సిద్ధమవుతున్నారు. మంచి స్క్రిప్ట్‌లు వస్తే హీరోగా కంటిన్యూ అవుతానని అంటున్న సునీల్, తాజాగా నటించిన ‘2 కంట్రీస్’ నేడు విడుదల అవుతోంది. మహాలక్ష్మి ఆర్ట్స్ పతాకంపై ఎన్.శంకర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గురించి సునీల్ చెప్పిన విశేషాలు- ‘‘2 కంట్రీస్ మలయాళంలో ఆల్రెడీ హిట్ చిత్రం. నాకు టైలర్ మేడ్ పాత్ర. ఇది చూడ్డానికి చాలా బావుంటుంది. 95 శాతం వినోదాత్మకంగా సాగుతోంది. చివరి ఐదు నిమిషాలు మాత్రం సెంటిమెంట్‌తో కంటతడి పెట్టిస్తుంది. అసలు ఈ కోణంలో ఆలోచించనే లేదండి. నేన చేస్తున్న నాలుగో రీమేక్. అందులో దిలీప్ నటించిన సినిమాలు రెండున్నయి ఇది కూడా మలయాళంలో దిలీప్ నటించిన చిత్రమే. ఈ చిత్రంలో డబ్బుకోసం వెంపర్లాడే పాత్ర నాది. అలాగని ఎవరినీ హత్యలు చేయను. భారీ మోసాలు చేయను. చిన్నా చితకా మోసాలు చేస్తుంటాను. అలాంటి వ్యక్తి ప్రేమలో పడితే, ఆ అమ్మాయి అతన్ని ఎలా మార్చింది అనేది కానె్సప్ట్. ఈ సినిమాపై చాలా నమ్మకం ఉంది. నా గత చిత్రాలు రెండే పరాజయం అయ్యాయి. అవి కూడా సరైన రిలీజ్ టైమ్ చూసి ప్లాన్ చేసుకుని వుంటే బావుండేది. కానీ ఎక్కడో తేడా జరిగింది. అయినా థియేటర్ వసూళ్లు కూడా బాగానే వచ్చాయి. మనం వాటి గురించి ఎప్పుడూ చెప్పలేదు కాబట్టి జనాలకు తెలియదు, అంతే. నా తొలి, మలి సినిమాల నుంచి కూడా నేను సినిమాల విషయంలో వేలు, కాలు, చేయి పెడుతూనే ఉన్నాను. మరి ఆ సినిమాలు హిట్ అయినపుడు ఈ మాటలు ఎందుకు రాలేదు? ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? విజయానే్న కాదు అపజయాన్ని కూడా అంగీకరించగలిగిన మనస్తత్వం అందరికీ ఉండాలి. అంతెందుకు, ‘అందాల రాముడు’ సినిమా సమయంలో త్రివిక్రమ్ నాకోసం డైలాగులు రాశారు. కానీ అప్పట్లో ఆయన కోట్లు తీసుకునేవారు కానీ నా కోసం ఫ్రీగా చేశారు. మరి ఆ సమయంలో అలాంటి విషయాలన్నీ ఎందుకు గుర్తుకురాలేదు. ఎవరూ ఎందుకు ప్రచారం చేయలేదు? కామెడీ సినిమాలు చాలా తగ్గాయి. ఒకప్పుడు జంధ్యాలగారు, బాపుగారు, ఇవివిగారు.. ఇలా చాలామంది ఉండేవారు. ఇపుడు త్రివిక్రమ్ ఉన్నాడు కానీ, అతను చాలా పెద్దవాళ్ళతో చేస్తున్నాడు కాబట్టి వాటిని వదులుకుని నాలాంటి వాళ్ళతో చేయడానికి కూడా నేను ఒప్పుకోను. త్రివిక్రమ్‌తో చేస్తానన్నాను. కానీ అతను ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడుతున్నాడు. అప్పుడెప్పుడో మాతో గల్లీ క్రికెట్ ఆడారు కదా అని అతన్ని పిలిచి ఆడమనడం కరెక్టు కాదు.