శత్రువుల మధ్య ఆమె..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహేష్ ఎన్నింటి, స్నేహాసింగ్, అనికా అబ్బాస్ ప్రధాన తారాగణంగా రూపొందించిన లఘు చిత్రం ‘ప్రేమతో ప్రేమ్’. సరికొత్త ప్రేమకథతో రూపొందిస్తున్న ఈ చిత్రం ట్రయాంగిల్ లవ్‌స్టోరీగా రూపొందించారు. ఈ సందర్భంగా నిర్మాత జె.సి. క్రియేషన్స్ మాట్లాడుతూ- ఇప్పటివరకు వెండితెరపై ఒకే అమ్మాయిని ప్రేమించిన ఇద్దరు మిత్రుల కథలు చూశాం. కానీ ఈ చిత్రంలో ఇద్దరు శత్రువులు ఒకే అమ్మాయిని ప్రేమిస్తారు. చివరికి విజేతగా ఎవరు నిలిచారు అనే అంశంతో ఈ చిత్రాన్ని రూపొందించాం. త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. అనేక మలుపులతో సాగే ఈ లఘు చిత్రాన్ని డిజిటల్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటుందనే నమ్మకం వుందని, కంప్లీట్ యూత్‌పుల్ షార్ట్ఫిలింగా రూపొందించామని తెలిపారు. ఈ చిత్రానికి మాటలు, స్క్రీన్‌ప్లే: భరద్వాజ్, సంగీతం: ఎల్విన్ జాషువా, కెమెరా: సందీప్ బద్దులు, దర్శకత్వం: నాగరాజు శింగిరిశెట్టి.