అన్నీ చేయలేం:అల్లు శిరీష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాకు ప్రేమ కథలు, కుటుంబకథలంటే చాలా ఇష్టం. అలాగని అలాంటి పాత్రలే అన్నీ చేయలేం. బన్నీ వేదంలో చేసిన కేబుల్ రాజు పాత్ర, రుద్రమదేవిలో చేసిన గోన గన్నారెడ్డి పాత్రలు చూసినపుడు మనం కూడా ఏవైనా కొత్త ప్రయోగాలు చేయకూడదా అనిపిస్తుందని అల్లు శిరీష్ తెలిపారు. వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో సీరత్‌కపూర్, సురభి, శిరీష్ ప్రధాన తారాగణంగా రూపొందించిన ఒక్క క్షణం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంలో ఆయన చిత్ర విశేషాలు పంచుకున్నారు. ‘‘ఒక్క క్షణం చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఒక కథానాయకుడిగా అంతకన్నా ఆనందం ఏముంది? ఎమోషనల్ సన్నివేశాలలో, ఫైట్ సీన్‌లలో బాగా చేసానని అంటున్నారు. కొత్త కానె్సప్ట్‌తో చేయాలని ఈ చిత్రంలో నటించా. దర్శకుడు నలభై నిమిషాలు కథ చెప్పిన విధం నచ్చడంతో ఒప్పుకున్నా. ప్యార్లర్ లైఫ్ అనే పాయింట్ వినగానే ఆ కథనం నచ్చింది. మంచి పాయింట్ ఎప్పుడూ వెంబడిస్తూనే వుంటుందికదా! కథ విన్నప్పటి నుంచి నిజంగా మనకు వేరొకరితో ప్యార్లర్‌లైఫ్ వుండొచ్చునేమో ఒకరికి యాదృచ్ఛికంగా జరిగితే మనకుకూడా జరగవచ్చేమో అన్న పాయింట్ ఆసక్తి కలిగించింది. కామెడీ, ఫ్యామిలీ, ఎమోషన్‌లను ఎక్కువగా ప్రజెంట్ చేసాము. ప్రస్తుతం రెండు మూడు కథలు విని ఓకే చెప్పా. అన్నీ డెవలప్‌మెంట్ స్టేజ్‌లో వున్నాయి. కొత్తవాళ్లతో చేయడానికి ఎప్పుడూ సిద్ధమే. ఎందుకంటే వాళ్ల ఆలోచనలు కొత్తగా వుంటాయని’’ ముగించారు.