కుమార్తెలు వారసత్వంగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చలనచిత్ర రంగ పరిశ్రమలో కొడుకులనే కాక కుమార్తెలను సైతం నటనకు వారసత్వంగా, దర్శకత్వానికి, గాయకులుగా వారసత్వంగా కొత్తదనాన్ని ఆహ్వానిస్తుందని చెప్పవచ్చు. అందులో భాగంగానే సీనియర్ నటి లక్ష్మి కుమార్తె ఐశ్వర్య, మామగారు, బ్రహ్మ వంటి అనేక చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. కొన్ని సినిమాల్లో విలన్ పాత్రలను సైతం పోషించింది. ఇంకా నటిస్తూనే వుంది. అలనాటి తమిళ అందాల నటుడు జెమిని గణేశన్ కుమార్తె ‘రేఖ’ హీరోయిన్‌గా హిందీ పరిశ్రమలో ఏలింది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్న పాత్రలను పోషించింది. కమలహాసన్ కుమార్తె శృతిహాసన్ వివిధ భాషలలో హీరోయిన్‌గా నటించి ప్రాచుర్యం పొందింది. రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య దర్శకత్వ శాఖలో ప్రతిభను చాటుతోంది. శరత్‌కుమార్ కుమార్తె విశాల్ హీరోగా నటించిన చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తెను హీరోయిన్‌గా పరిచయం చేస్తున్నారు. అలాగే కలెక్షన్‌కింగ్ మోహన్‌బాబు కుమార్తె మంచు లక్ష్మీప్రసన్న హీరోయిన్‌గా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్నారు. సూపర్‌స్టార్ కృష్ణ కుమార్తె మంజుల ‘షో’, ఆరెంజ్ వంటి చిత్రాలలో నటించారు. నటుడు ఉత్తేజ్ కుమార్తె హీరోయిన్‌గా పరిచయమైంది. అలాగే నాగబాబు కుమార్తె కొన్ని సినిమాలలో హీరోయిన్‌గా నటిస్తోంది. అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు సుప్రియ సైతం పవన్‌కళ్యాణ్‌తో జోడీగా ఒక సినిమాలో నటించింది. అలాగే రాధిక వారసురాలిగా నిరోషా, భానుప్రియ వారసురాలిగా శాంతిప్రియ, విజయలలితకు వారసురాలిగా విజయశాంతి లేడీ అమితాబ్‌గా ప్రాచుర్యం పొందారు. అలనాటి నటి మేనక కుమార్తె కీర్తిసురేష్ ప్రముఖ హీరోయిన్‌గా తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో రాణిస్తున్నారు. శ్రీదేవి కుమార్తె జాహ్నవి హిందీ పరిశ్రమలో అడుగిడుతోంది. హిందీలో శక్తికపూర్ కుమార్తె శ్రద్ధాకపూర్, ప్రియాంకా చోప్రా సోదరి పరిణితి చోప్రా, సైఫ్ అలీఖాన్ కుమార్తె సారా సైఫ్ అలీఖాన్ వంటివారు వారసత్వ నటనకు శ్రీకారం చుట్టారు. అలాగే అలనాటి ప్రముఖ నటుడు రణధీర్‌కపూర్ కుమార్తెలు కరిష్మాకపూర్, కరీనాకపూర్, తనూజ కుమార్తె, హిందీ నటి కాజల్ ప్రముఖంగా ఉన్నారు. ఇంకా ఎందరో నటీనటులు తమ వారసులను క్యారెక్టర్ ఆర్టిస్టులుగా స్థిరపడే విధంగా దోహదపడ్డారు.

- అయినం రఘురామారావు