ప్రేమాయణంలో దిశా పటాని!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కింగ్ ఫిషర్ క్యాలెండర్ నుంచి బాలీవుడ్.. అటునుంచి టాలీవుడ్‌కు వచ్చిన దిశాపటానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందే. తెలుగులో ఆమె నటించిన లోఫర్ చిత్రం సరైన ఫలితం ఇవ్వకపోవడంతో బాలీవుడ్‌లోనే మకాం వేసింది. బ్లాక్‌బస్టర్ హిట్ ఆమె ఖాతాలో లేకపోయినా, అవకాశాలు వస్తూనే వున్నాయి. ఇక మార్షల్ ఆర్ట్స్ హీరో టైగర్‌ష్రాప్‌తో ప్రేమాయణం నడుపుతూ నిత్యం వార్తల్లో వుండేందుకు ప్రయత్నిస్తోంది ఆమె. ఎవరికీ అంతుచిక్కకుండా వారు షికార్లు చేస్తున్నారట. తాజాగా నూతన సంవత్సరం వేడుకలు జరుపుకోడానికి విదేశాలకు వెళ్లడానికి సిద్ధమయ్యారు. ఒకరికి తెలియకుండా ఒకరు విదేశాలకు వెళుతున్నట్లు బిల్డప్ ఇచ్చి ఒకే ఫ్లయట్‌లో టికెట్‌లు బుక్ చేసుకున్నారు. అదే సమయంలో ఎవరికివారు విమానాశ్రయానికి వచ్చి గుట్టుచప్పుడు కాకుండా విమానం ఎక్కడానికి ప్రయత్నిస్తుండగా అక్కడే వున్న రణవీర్‌సింగ్ ఈ విషయాన్ని బయటపెట్టారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్‌లో వైరల్ అవుతున్నాయి. టైగర్‌ష్రాఫ్ సోదరి కృష్ణ ష్రాఫ్ దిశాపటానీకి దగ్గరి స్నేహితురాలు. ప్రేమికులు మాత్రం తమతమ ఇళ్లలో ఈ వ్యవహారం చెప్పకపోయినా రెండు కుటుంబాలకు ఈ సంగతి తెలుసట. అందుకే ఇద్దరూ రెచ్చిపోయి మరీ ప్రేమయాణంలో మునిగిపోయారని కోలీవుడ్ అంటోంది!