కామెడీ రొమాన్స్‌తో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుధీర్‌బాబు, అతిథిరావుహైదరీ జంటగా శ్రీదేవి మూవీస్ పతాకంపై మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్ రూపొందించిన చిత్రం తొలి షెడ్యూల్ పూర్తయింది. డిసెంబర్ 11 నుంచి 23 వరకు హైదరాబాద్‌లో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిపారు. మరో షెడ్యూలు జనవరి 1 నుంచి ప్రారంభం కానున్నది. పేరు నిర్ణయించని ఈ చిత్ర వివరాలు త్వరలో తెలియజేయనున్నారు. సంక్రాంతికి టైటిల్ ప్రకటించి మేలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దర్శకుడు మోహనకృష్ణ మాట్లాడుతూ, రొమాన్స్, కామెడీ కలగలిపిన కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని కథానాయకుడు పిల్లల పుస్తకాలకు బొమ్మలు గీసే చిత్రకారునిగా నటిస్తున్నారని ఆద్యంతం వినోదాత్మకంగా సాగే ఈ చిత్రానికి పి.జి.వింద కెమెరా పనితనం హైలైట్‌గా నిలుస్తుందని తెలిపారు. నరేష్, తనికెళ్ల భరణి, నందు, రాహుల్, పవిత్ర లోకేష్, కాదంబరి కిరణ్ నటిస్తున్న ఈచిత్రానికి సంగీతం: వివేక్ సాగర్, రచన-దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి.