రేసులో ముందుకు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దక్షిణాది స్టార్ కథానాయికల రేసులోముందు వరుసలోనే ఉంది రకుల్ ప్రీత్‌సింగ్. ప్రస్తుతం చేతినిండా చిత్రాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తోంది. తెలుగులో మూడు, తమిళంలో రెండు భారీ ప్రాజెక్టులు ప్రస్తుతం ఆమె చేతిలో వున్నాయి. అలాగే మహేష్‌బాబు సినిమా చర్చల దశలో వుంది. నాలుగేళ్లుగా వరుసగా సినిమాలు చేస్తూ విరామం లేకుండా వుంది. కొంచెం కష్టమే అయినా మంచి కథలు వదులు కోవడం కోసం ఇష్టం లేక నటిస్తూనే వుంది, సంఖ్య కాకుండా, నాణ్యతకు ప్రాధాన్యమిస్తూ కెరీర్‌లో దూసుకు వెళుతోంది. ఇదిలా వుండగా తాజాగా రవితేజతో మరోసారి జోడీ కట్టబోతోందిట. రవితేజ హీరోగా నటించిన ‘కిక్-2’ బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టినా అందులో అతడి సరసన ఆడిపాడిన అందాలబొమ్మ రకుల్ ప్రీత్‌సింగ్‌కు మాత్రం హీరోయిన్‌గా మంచి పేరే వచ్చింది. ఈ చిత్రం ద్వారా రవితేజ - రకుల్ ప్రీత్‌సింగ్ సూపర్ జోడీగా అందరూ కొనియాడారు. ఇందులో ఇద్దరి క్యారెక్టర్స్‌కు భలే గుర్తింపు, క్రేజ్ ఏర్పడింది. ఈ జోడీ మరోసారి వెండితెరపై కనువిందు చేయబోతోందని సమాచారం. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో రవితేజ హీరోగా ఈ చిత్రం రూపొందనుందట. కళ్యాణ్ చెప్పిన కథకి రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. ఫ్రస్తుతం రవితేజ చేస్తున్న ‘టచ్ చేసి చూడు’ చిత్రం పూర్తి కాగానే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లడానికి సిద్ధమవుతోంది. రవితేజకు జోడీగా రకుల్ ప్రీత్‌సింగ్‌ను ఎంపిక చేశారట. కళ్యాణ్ కృష్ణ ఇది వరకు తీసిన ‘రారండోయ్.. వేడుక చూద్దాం’లో రకుల్ కథానాయికగా చేసిన విషయం తెలిసిందే. అయితే రవితేజ కోసం తయారు చేసిన కథలోనూ తన పాత్ర నచ్చడంతో రకుల్ ఈ సినిమాకు ఓకే చెప్పినట్టుల తెలిసింది. బాలీవుడ్ ‘అయ్యారీ’ సినిమాలో నటించడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న రకుల్.. మంచి పాత్రలు ఎక్కడ లభిస్తే అక్కడ చేస్తానంటూనే టాలీవుడ్‌ని మాత్రం వదిలేదిలేదంటోంది. చేసే ఏ చిత్రంలోనైనా కథలో సత్తా వుండాలేగానీ భాషతో పనేంటి? అంటోంది రకుల్.