5న ‘సారథి’ వస్తున్నాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధను క్రియేషన్స్ పతాకంపై అల్లం భువన్ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘సారధి’. నూతన తారలు రేవంత్.జిహెచ్, సమ్మోహిత్, అనితా రాఘవ, తేజారెడ్డి ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. ఈ చిత్రం ఈనెల 5న విడుదలకు సిద్ధమైన సందర్భంగా పాత్రికేయుల సమావేశం జరిగింది. అల్లం భువన్ మాట్లాడుతూ- తన తొలి చిత్రంగా రూపొందించిన ఈ సినిమాలో నటీనటులందరూ కష్టపడి నటించారని, మొదట తాను ఎలా తీస్తానో అని భయపడినవారు ఆ తరువాత సినిమా చూసి అభినందించారని తెలిపారు. డైలాగులు చిత్రంలో హైలెట్‌గా వుంటాయని, నిజాయితీగా వుండడమే రాజకీయ నాయకుల, పోలీసుల విధి అని సారాంశమే ఈ చిత్రంలో వుంటుందని ఆయన అన్నారు. 25 లఘు చిత్రాల్లో నటించిన తాను, తొలిసారిగా పెద్ద తెరతో పరిచయం అవుతున్నానని, ఈ చిత్రానికి సంబంధించిన పాటలను వైజాగ్‌లో విడుదల చేయగా మంచి ఆదరణ లభించిందని కథానాయకుడు రేవంత్ తెలిపారు. సినిమా ప్రేక్షకులకు ఈ చిత్రం నచ్చుతుందని, మ్యూజిక్ హైలెట్‌గా నిలుస్తుందని కథానాయిక అనితా రాఘవ తెలిపారు. మంచి కథాంశంతో వస్తున్న ఈ చిత్రం తప్పక విజయవంతం అవుతుందని జి.సురేష్ కుమార్ తెలిపారు. భానుచందర్, మల్లాది రాఘవ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎడిటింగ్:నందమూరి హరి, కెమెరా:టి.కె.పరంధామ, సంగీతం:వి.కిరణ్‌కుమార్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, నిర్మాత:అల్లం భువన్.