మూడు పూలు ఆరు కాయలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్మైల్ పిక్చర్స్ పతాకంపై రామస్వామి దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రానికి ‘మూడు పువ్వులు ఆరు కాయలు’ అనే పేరును ఖరారు చేశారు. అర్జున్ యజత్, భరత్ భండారి, రామస్వామి కథానాయకులుగా నటిస్తున్న ఈ చిత్రంలో సౌమ్యా వేణుగోపాల్, పావని, సీమాచౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- నవ్వినా ఏడ్చినా కన్నీళ్లే వస్తాయి అనే కథనంతో కడుపుబ్బ నవ్వించే హాస్యరసంతోపాటుగా కంట తడి పెట్టించే సన్నివేశాలు కూడా ఈ చిత్రంలో ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తిచేసి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నామని, మంచి పాయింట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం కుటుంబమంతా కలిసి చూడదగిన విధంగా వుంటుందని ఆయన తెలిపారు. తనికెళ్ల భరణి, కృష్ణ్భగవాన్, పృధ్వీ, అజయ్ ఘోష్, బాలాజీ, రాకెట్ రాఘవ, ఆటో రాంప్రసాద్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి పాటలు:చంద్రబోస్, భాస్కరభట్ల, ఎడిటింగ్:ఉపేందర్, కెమెరా:ఎన్.మోహన్‌చంద్, సంగీతం:విష్ణు, సాయి, నిర్మాత:వబ్బిన వెంకట్రావు, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం:రామస్వామి.