సినిమా ఎల్లలు చెరిపేస్తుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘సినిమా అంటే ఎవరికైనా ప్రేమే. అందులో ఉన్న ఆనందాన్ని అనుభవిస్తూ ఏ దేశానికి చెందిన ప్రేక్షకుడైనా తమ కథగానే భావిస్తాడు. అలా ప్రపంచంలో సినిమా అనేది దేశాలమధ్య ఎల్లలు చెరిపేస్తుంది’ అని కేంద్ర మంత్రి రాజవర్ధన్‌సింగ్ రాథోడ్ అన్నారు. గోవాలో జరుగుతున్న 46వ అంతర్జాతీయ భారతీయ చలనచిత్రోత్సవం ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆసియాలోనే గొప్ప చలనచిత్రోత్సవంగా గోవా ఫిలిమ్ ఫెస్టివల్ నిర్వహిస్తుండడం ఆనందదాయకమని ఆయన అన్నారు. ఈ ఉత్సవం ఇంత నిర్వహించడానికి సహకరించిన గోవా ప్రజలు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని, పర్యాటక స్థలంగా వెలుగొందుతున్న గోవా ఈ ఉత్సవాలతో మరింత మెరిసిందని ఆయన అభివర్ణించారు. విదేశాలనుండి వచ్చే ప్రతినిధులు గోవాలో ఫిలిమ్ ఫెస్టివల్‌లో పాల్గొంటూ భారతదేశంలో అందమైన ఈ ప్రాంతాన్ని చూశారని, పర్యాటక రంగానికి ఇది శుభసూచికమని తెలిపారు. ఇప్పటివరకూ 90 దేశాలనుండి వచ్చిన 250కిపైగా చిత్రాలను ఈ ఫిల్మ్‌ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. ముగింపు కార్యక్రమంలో ఈ చిత్రాలలో పోటీకి నిలిచిన సినిమాలలో విజేతలను ప్రకటించారు. తొలి చిత్రంగా భారతదేశానికి చెందిన ప్రపంచ ప్రఖ్యాత గణిత శాస్తజ్ఞ్రుడిగా పేరుగాంచిన శ్రీనివాస రామానుజన్ జీవిత చరిత్ర నేపథ్యంలో లండన్‌లో రూపొందించిన ‘ది మేన్ హూ న్యూ ఇన్ఫినిటీ’ చిత్రాన్ని ప్రదర్శించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆస్కార్ అవార్డు విజేత, భారతీయ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ సంగీత కార్యక్రమం నిర్వహించారు. పనాజీలో జరిగిన ఈ చలనచిత్రోత్సవంలో అనేక మంది విదేశీ ప్రతినిధులు, భారతదేశ దర్శక, నిర్మాతలు పాల్గొన్నారు.