కళ్యాణ్‌రామ్ ప్రేమకథ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందమూరి కళ్యాణ్‌రామ్, తమన్నా జంటగా జయేంద్ర దర్శకత్వంలో కూల్‌బ్రిజ్ సినిమాస్, ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రానికి ‘నా నువ్వే’ టైటిల్‌ను ఖరారుచేశారు. ఈ సందర్భంగా ఫస్ట్‌లుక్, టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత వివరాలు తెలియజేస్తూ- జనవరి నెలాఖరుకు షూటింగ్ పూర్తవుతుంది. ఈ చిత్రానికి ‘నా నువ్వే’ అనే టైటిల్‌ను ఫిక్స్‌చేశాం. కొత్త కానె్సప్టుతో, ఫ్రెష్ లు క్‌తో దర్శకుడు జయేంద్ర అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు. తమన్నా కళ్యాణ్‌రామ్‌ల తొలి కాంబినేషన్ సినిమాకే హైలెట్‌గా నిలుస్తుంది. పి.సి.శ్రీరామ్ కెమెరా పనితనం మ రో అస్సెట్ అన్నారు. సమర్పకుడు మహేష్ కోనేరు మాట్లాడుతూ- టాప్ టెక్నీషియన్ల తో తెరకెక్కిస్తున్న చిత్రమిది. కళ్యాణ్‌రామ్‌కు కొత్త మేక్‌ఓవోర్‌ని ఇస్తుందని నమ్ముతు న్నాం. వేసవి సెలవుల్లో చిత్రాన్ని విడుదల చేస్తాం. శరత్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: పి.సి.శ్రీరాం, ఎడిటింగ్: టి.ఎస్.సురేష్, నిర్మాతలు: కిరణ్ ముప్పవరపు, విజయ్ వట్టికూటి, సమర్పణ: మహేష్ కోనేరు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జయేంద్ర.