క్రేజీ భామ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్‌లో ప్రస్తుతం మంచి క్రేజ్‌మీదుంది గ్లామర్ భామ రకుల్ ప్రీత్‌సింగ్. వరుసగా అటు స్టార్ హీరోలు.. ఇటు కుర్ర హీరోలతో జోడీ కట్టి దూసుకుపోతోంది. ఈమె నటించిన సినిమాల సక్సెస్ రేట్ కూడా అంతే వేగంగా సాగుతోంది. ప్రస్తుతం తెలుగులో ఓ చిత్రంలో నటిస్తున్న రకుల్‌కు మరో క్రేజీ అవకాశం కూడా దక్కింది. తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా నటిస్తున్న చిత్రంలో హీరోయిన్‌గా రకుల్ పేరు వినిపిస్తోంది. సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని, అందులో మెయిన్ లీడ్‌గా రకుల్‌ని ఎంచుకోవాలని దర్శకుడు భావిస్తున్నాడట. ఇప్పటికే ఆమెతో చర్చలు కూడా జరిపినట్టు తెలిసింది. మరో హీరోయిన్‌గా ‘్ఫదా’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన సాయిపల్లవి నటిస్తుందని అంటున్నారు. మొత్తానికి సూర్య సరసన రకుల్‌తోపాటు సాయిపల్లవి కూడా ఛాన్స్ కొట్టేసినట్టే!