భరత్ మొదలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా నటిస్తున్న చిత్రం ‘్భరత్ అను నేను’. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నేటినుండి మరో షెడ్యూల్ మొదలైంది. ఇటీవలే మహేష్ ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్లిన విషయం తెలిసిందే. ఆయన తిరిగి మొన్న హైదరాబాద్ రావడంతో నేటినుండి షూటింగ్ మొదలుపెట్టారు. ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలోని శంకర్‌పల్లి ఏరియాలో చిత్రీకరణ జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో హీరోయిన్ ఖైరా అద్వానీ కూడా పాల్గొంటుందట. మహేష్-కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన ‘శ్రీమంతుడు’ తరువాత వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే బిజినెస్ వర్గాల్లో సంచలనం రేపుతున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 27న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా తరువాత మహేష్ వంశి పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కే చిత్రంలో నటించనున్నాడు. ఫిబ్రవరి నుండి ఈ చిత్రం సెట్స్‌పైకి రానున్నదట.