మనసుకు నచ్చింది..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నటి, నిర్మాతగా తనకంటూ ప్రత్యేకమైన పంథాను ఏర్పరచుకొని ఇప్పుడు దర్శకురాలిగా పరిచయమవుతున్న మల్టీ టాలెంటెడ్ పర్సన్ మంజుల ఘట్టమనేని. సూపర్‌స్టార్ కృష్ణ కుమార్తె, మహేష్‌బాబు అక్క అయినప్పటికీ, తండ్రి, తమ్ముడి స్టార్‌డమ్‌ల ఆసరాగా చేసుకోకుండా, స్వయంకృషితో ఎదిగిన మహిళ మంజుల. నటిగా ‘షో’ సినిమాతో ఆశ్చర్యపరిచిన మం జుల, నిర్మాతగా ‘పోకిరి’ చిత్రంతో సరికొత్త రికార్డులు సృష్టించారు. ఇప్పుడు దర్శకురాలిగా ‘మనసుకు నచ్చింది’ అనే చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్నారు. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, ఇందిరా ప్రొడక్షన్స్ పతాకాలపై సంజయ్ స్వరూప్, పి.కిరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మనసుకు నచ్చింది’. సందీప్ కిషన్, అమైరా దస్తూర్ జంటగా నటించిన ఈచిత్రం ట్రైలర్‌ను మహేష్‌బాబు ఫేస్‌బుక్/ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. అన్ని వర్గాల ప్రేక్షకులనుంచి మంచి స్పందన సంపాదించుకొన్న ‘మనసుకు నచ్చింది’ చిత్రం ఈనెల 26న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ- ట్రైలర్‌కి విశేషమైన స్పందన లభించింది. రొమాంటిక్ డ్రామాగా రూపొందిన ‘మనసుకు నచ్చింది’ ట్రైలర్ అందరికీ నచ్చుతుందన్న నమ్మకం ఉంది. రాధన్ సంగీతం అందించిన మ్యూజిక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే ప్రిరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించి 26న చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నాం అన్నారు.