బన్నీ బ్రాండ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమాలతోపాటు వాణిజ్య ప్రకటనల్లో కూడా ఎక్కువగా కనిపించే తెలుగు హీరోల్లో అల్లు అర్జున్ కూడా ఒకరు. ఈయనకున్న ఫాలోయింగ్ దృష్ట్యా పలు దేశీ కంపెనీలు ఆయనను తమ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకున్నాయి. ఇప్పటికే కోల్గేట్, రెడ్‌బస్, హీరో మోటోకార్ప్, హాట్‌స్టార్ 7 అప్, జాయ్ అలుకాస్ వంటి సంస్థలకు ప్రచారకర్తగా వ్యవహరించిన బన్నీ ఇప్పుడు మరొక కొత్త ప్రొడక్ట్‌కు బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. అదే పార్లే అగ్రోవారి ఫ్రూటీ. దక్షిణాది మార్కెట్ మొత్తానికి బన్నీయే ప్రచారకర్తగా వ్యవహరిస్తారు. ఈ ఏడాది వేసవి నుండి ఈ క్యాంపైన్ మొదలుకానుంది. ఇకపోతే ప్రస్తుతం బన్నీ వక్కంతం వంశీ దర్శకత్వంలో ‘నా పేరు సూర్య’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఏప్రిల్ 27న ఈ చిత్రం విడుదల కానుంది.