సెట్స్‌పైకి సంఘమిత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాహుబలి స్ఫూర్తితో భారీ చిత్రాలకు ప్రయత్నాలు జరుగుతూనే వున్నాయి. తమిళంలో భారీ బడ్జెట్‌తో సంఘమిత్ర పేరుతో ఓ చిత్రాన్ని రూపొందించేందుకు ఆమధ్య గట్టి ప్రయత్నాలే జరిగాయి. మధ్యలో హీరోయిన్ విషయంలో ఇబ్బంది తలెత్తడంతో చిత్రీకరణ ఆగిపోయింది. సుందర్.సి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం త్వరలో మొదలుపెడతామని తెలియజేస్తున్నాడు దర్శకుడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తికావచ్చాయని, 18 నెలలపాటు స్క్రిప్ట్ వర్క్, ఇతర పనులు జరుపుకున్న ఈ చిత్రానికి సంబంధించిన గ్రాఫిక్స్ పనులు జరుగుతున్నాయని తెలిపారు. సంఘమిత్ర పాత్రలో ఇంతకుముందు శృతిహాసన్ కొన్ని సన్నివేశాల్లో నటించింది. పది రోజుల తరువాత ఆమె తప్పుకోవడంతో ఈ పాత్రలో ఎవరు నటిస్తారనే విషయంపై చర్చలు జరిగాయి. చివరగా బాలీవుడ్ భామ దిశాపటాని నటిస్తుందంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఆమెను హీరోయిన్‌గా ఖరారు చేయలేదట. కానీ కోలీవుడ్ వర్గాల ప్రకారం దిశా పటాని నటిస్తుందంటూ వార్తలు వస్తున్నాయి. శ్రీ తేనాండాల్ ఫిలింస్ పతాకంపై తెరకెక్కనున్న ఈ చిత్రం ఏకంగా 450 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిస్తారట.