నటిగా నిరూపించుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందమూరి బాలకృష్ణ, నయనతార జంటగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జై సింహా’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అవుతోంది అందాల భామ నటాషా దోషీ. ఈ చిత్రం శుక్రవారం విడుదలవుతున్న సందర్భంగా ఈ చిత్రంలో తనది కథలో ప్రాముఖ్యత వున్న పాత్ర అని చెబుతున్న నటాషా చెప్పిన విశేషాలు.. నేను పుట్టి పెరిగింది అంతా ముంబైలోనే. అమ్మ మలయాళీ, నాన్న గుజరాతి. చిన్నప్పటినుంచీ సినిమాలంటే ఆసక్తి. నేను డెంటిస్ట్ కోర్స్ చేశాను. తెలుగులో ఇది నా మొదటి చిత్రం. తొలి చిత్రంతోనే బాలకృష్ణ లాంటి పెద్ద స్టార్ సినిమాలో నటించడం ఆనందంగా వుంది. బాలకృష్ణ ఎంతో సపోర్టు అందించి ఎంకరేజ్ చేశాడు. ఈ చిత్రంలో నేను తాన్య అనే పాత్రలో కన్పిస్తాను. దర్శకుడు కె.ఎస్.రవికుమార్ గురించి కొత్తగా చెప్పేది ఏమీ లేదు. ఆయన అద్భుతంగా తెరకెక్కించాడు. నయనతార లాంటి సూపర్‌స్టార్‌తో కలిసి నటించడం ఆనందంగా వుంది. ఈ చిత్రంలో బాలకృష్ణ డాన్సుల్లో అదరగొట్టాడు. ఆయనతో పోటీపడి చేయడానికి కాస్త కష్టపడాల్సి వచ్చింది. ఈ సినిమాతో తెలుగులో నాకు మంచి గుర్తింపు లభిస్తుందన్న నమ్మకం వుంది. హీరోయిన్‌గా మలయాళం సినిమాతో పరిచయం అయ్యాను. మంచి పాత్రలు చేయాలని ఉంది. అది తెలుగులో అయినా, ఏ భాషలో అయినా సరే అంటూ ముగించారు.