హాథీరామ్ బాబాగా నటిస్తున్నా-- హీరో నాగార్జున

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘హాథీరామ్‌బాబా’ చిత్రంలో నటిస్తున్నానని, ఈ ఏప్రిల్‌లోనే షూటింగ్ మొదలవుతుందని హీరో నాగార్జున తెలిపారు. ‘సోగ్గాడే చిన్నినాయన’ విడుదలై 35రోజులు అయిన సందర్భంగా హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో శనివారం నాగార్జున ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో పలు విశేషాలు తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘మనం’ లాంటి క్లాసికల్ హిట్ తర్వాత మరో రొమాంటిక్ హిట్‌గా ‘సోగ్గాడే చిన్నినాయనా’ నిలిచిందని, ఈ జోనర్‌లో తనను ఇంతగా ఆదరించినందుకు ఆనందంగా వుందని తెలిపారు. ఈ ఉత్సాహంతోనే మరిన్ని కొత్త పాత్రల్లో నటించాలన్న నిర్ణయం తీసుకున్నానని, ‘సోగ్గాడే చిన్నినాయనా’ 400 థియేటర్లలో విడుదలై 53 కోట్లు వసూలుచేయడం ఆనందంగా వుందని, ఈ సందర్భంగా తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. ‘మనం’, ‘మీలోఎవరు కోటీశ్వరుడు’, ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రాలతోపాటు ఇటీవల నటించిన ఊపిరి చిత్రంలో నటించడం ఆనందంగా వుందని, ఈ సినిమా కచ్చితంగా ఓ ట్రెండ్ సెట్టర్ అవుతుందని తెలిపారు. ‘ఊపిరి’ చిత్రం తాను చూశానని, పూర్తి సంతృప్తినిచ్చిందని, అలాగే బంగార్రాజు పాత్ర నేపధ్యంలో ఓ చిత్రంలో నటించడానికి కూడా సిద్ధవౌతున్నానని చెప్పారు.
కళ్యాణ్‌కృష్ణ ఈ చిత్రంకోసం చాలా కష్టపడ్డారని, రేపటినుండి ‘ఊపిరి’ చిత్రానికి సంబంధించిన తెలుగు, తమిళ భాషలకు తానే డబ్బింగ్ చెబుతున్నానని ఆయన వివరించారు. కార్యక్రమంలో అనూప్ రూబెన్స్, దర్శకుడు కళ్యాణ్‌కృష్ణ కురసాల పాల్గొని విశేషాలు తెలిపారు.