ప్రయో‘జన’ సినిమా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రయో ‘జన’ సినిమా,
రచన: దేవరాజు మహారాజు
పేజీలు: 448, వెల: రూ. 360, ప్రతులకు: విశాలాంధ్ర అన్ని బ్రాంచీలు
*
సినిమాల గురించి వివిధ కోణాల్లో పరిశీలిస్తూ ఇంతవరకు శతాధిక గ్రంథాలు తెలుగు భాషలో వెలువడ్డాయి. ఈ విలక్షణ ప్రయో‘జన’ సినిమా గ్రంథ రచయిత డా.దేవరాజు మహారాజు సమాజానికి చెందిన పలు అంశాలపై పదుల సంఖ్యలో గ్రంథాలు వ్రాసి ఎనె్నన్నో పురస్కారాలు అందుకొన్న ప్రజ్ఞాశాలి. తాజాగా వారి కలం నుంచి వెలువడ్డ గ్రంథం ప్రయో‘జన’ సినిమా. టైటిల్‌లోనే సమాజానికి సినిమా యొక్క ప్రయోజనం ఏమిటి అనే ప్రశ్నతోబాటు ఈ గ్రంథంలో దానికి జవాబు దొరకుతుంది అనే సూచన కూడా స్ఫురిస్తుంది.
448 పేజీల ఈ పుస్తకంలో ప్రధానంగా 22 అధ్యాయాలున్నాయి. ఒక్కో అధ్యాయంలో రెండు నుంచి ఇరవై నాలుగు వరకూ ప్రకరణలున్నాయి. వీటిల్లో యానిమేషన్ చిత్రాలు, లఘు చిత్రాలు, డాక్యుమెంటరీలు, వైజ్ఞానిక చిత్రాలు, ఫిలిం సొసైటీలు, ఫిలిం జర్నలిజం, ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్, వివిధ భాషా చిత్రాలు, బాలల చిత్రాలు వంటి వివిధ అంశాలు క్షుణ్ణంగా వివరించి విశే్లషించారు. ఈ పుస్తకం తెలుగు భాషలో వుంది గనుక తెలుగు సినిమాతో పరిచయం వున్న, ఆసక్తి వున్న పాఠకులు ఆ దిశగా ఏమి వ్రాశారో అన్న ఉత్సుకత చూపిస్తాడు. తెలుగులో తొలి బాలల చిత్రం ‘్భక్త్ధృవ- అనసూయ’ (1936), ఆ తరువాత నిర్మాత, దర్శకుడు కె.ఎస్.ప్రకాశరావు అందరూ బాల నటీనటులతో తీసిన ‘బాలానందం’ (1954) గురించి ప్రస్తావన లేకపోవడం పాఠకుల్ని నిరుత్సాహపరుస్తుంది. ఇక ఇతర భాషా చిత్రాల గురించిన ప్రకరణల్లో సమాంతర లేక ఆఫ్ బీట్ లేక సహజ లేక ప్రయోజనం గల చిత్రాల గురించి ఆయా దర్శకుల గురించి వివరించడం ప్రశంసనీయం. ఆ దిశగా ‘స్వప్నదానం’ (కె.జి.జార్జి), చిదంబరం (అరవిందన్) సతి (అపర్ణాసేన్), ఏక్సిడెంట్ (శంకర్‌నాగ్) వంటి పలు చిత్రాల గురించి క్షుణ్ణంగా ప్రస్తావించారు. తెలుగు భాషా చిత్రాల ప్రకరణంలో 186వ పేజీలో ఎల్.వి.ప్రసాద్ గురించి వ్రాస్తూ 1954లో మద్రాసులో గృహలక్ష్మి చిత్రానికి దర్శకత్వం వహించారని వ్రాశారు. అది పొరపాటు. ఆ సంవత్సరం 1946, ఆ చిత్రం పేరు ‘గృహప్రవేశం’. మా భూమి (గీతాబసు), దాసి (నరసింగరావు), చిల్లరదేవుళ్ళు (మాధవరావు) చిత్రాల గురించి వివరించి ఆ కేటగిరిలోనే వచ్చిన మరోమలుపు, ఈ చరిత్ర ఏ సిరాతో.. (వేజెళ్ల సత్యనారాయణ), ఊరుమ్మడి బ్రతుకులు, నిమజ్జనం (బి.ఎస్.నారాయణ) చిత్రాలకు చోటులేకపోవడం విస్మయాన్ని కలిగిస్తుంది. అక్కినేని నాగేశ్వరరావు సినీ జీవిత ప్రస్తానాన్ని వివరించి ఆయన తీసిన సుడిగుండాలు, మరోప్రపంచం గురించి ఉదహరించారు. అయితే అంతకుపూర్వం 1954లో సహజమైన కథతో ‘తోడుదొంగలు’ చిత్రాన్ని నిర్మించి కేంద్ర ప్రభుత్వం వారి పురస్కారం అందుకొని, పౌరాణిక పాత్రలకు ప్రాణప్రతిష్ఠ చేసి రాజకీయ రంగంలో సంచలనం సృష్టించిన ఎన్.టి. రామారావు గురించి కనీసం ఒక పేరా అయినా ఉదహరించకపోవడం విస్మయాన్ని కల్గిస్తుంది. హిందీ చిత్ర రంగంలో దిలీప్‌కుమార్, అశోక్‌కుమార్, దేవానంద్, రాజ్‌కపూర్ గురించి వ్రాసి, తెలుగు ప్రకరణంలో ఎన్‌టిఆర్‌కు ఆ మాత్రం విలువ ఎందుకు లేకపోయిందో అర్థంకాదు. తమిళ చిత్రరంగం గురించిన ప్రకరణంలో శివాజీ గణేశన్, కమల్‌హాసన్, ప్రభుదేవాల గురించి ప్రస్తావించిన రచయిత, అటు చిత్ర రంగాన్ని ఇటు రాజకీయాలను ప్రభావితం చేసిన ఎం.జి.రామచంద్రన్, జయలలితలను విస్మరించటం పాఠకుల్ని విస్మయానికి గురిచేస్తుంది. ఇక సంగీత రంగ ప్రకరణంలో హిందీ చిత్ర రంగంలో లబ్దప్రతిష్ఠులైన లతా మంగేష్కర్, నౌషద్, ముఖేష్, ఎ.ఆర్.రెహమాన్ గురించి విపులంగా వివరించి తెలుగు సంగీత రంగాన్ని ప్రభావితం చేసిన సాలూరి రాజేశ్వరరావు తెలుగు సంగీత ప్రియులను ప్రాతఃస్మరనీయం. ‘స్వాతంత్య్రము మా జన్మ హక్కండి’ అని గళమెత్తిన ఘంటసాల గురించి ప్రస్తావించకపోవడం, ఆయన పేరిట విడుదలైన పోస్టల్ స్టాంపునైనా వేయకపోవటంతో నిశ్చయంగా తెలుగు పాఠకుడు నిరాశ చెందుతాడు. చార్లి చాప్లిన్‌తో ప్రారంభించి చైనా, జపాన్, జర్మనీ మొదలగు దేశాల్లోని చిత్రాల గురించి ప్రస్తావించడం ప్రశంసనీయం. సునిశితంగా పరిశీలిస్తే ఈ గ్రంథం ఫిలిం సొసైటీ ఉద్యమంతోనూ, సమాంతర చిత్రాలతోనూ మరియు జాతీయ, అంతర్జాతీయ చలన చిత్రోత్స వంలోనూ పురస్కారాలందుకున్న చిత్రాల గురించి చర్చించుకునే వారికి చేరువైనంతగా ఈ గ్రంథం తెలుగు సినిమాలను అభిమానించే సగటు తెలుగు పాఠకుడు ఎంతవరకు ఆదరిస్తారో వేచి చూడాలి.