అనుష్కను తప్ప వేరెవరినీ ఊహించలేం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భాగమతి కథకోసం అనుష్కను మాత్రమే ఊహించుకున్నాను. ఆమె తప్ప ఇంకెవరూ చేయలేని పాత్ర ఇదని అంటున్నాడు దర్శకుడు అశోక్. పిల్లజమిందర్ చిత్రంతో మంచి దర్శకుడిగా గుర్తింపుతెచ్చుకున్న అశోక్, అటుపై రెండు మూడు చిత్రాలను తెరకెక్కించాడు. ఆయన సినిమాలోని పాత్రలు రియాలిటీని చూపిస్తాయి. వాస్తవాన్ని కళ్లకు కనపడేలా చేస్తుంది. మనిషిలోని మరోకోణాన్ని టచ్ చేసే ప్రయత్నం చేస్తాయి. దర్శకుడిగా చేసింది తక్కువ సినిమాలే అయినా గుర్తింపు మాత్రం ఎక్కువే దక్కింది. తాజాగా ఆయన భాగమతి సినిమాతో మరో సరికొత్త థ్రిల్లర్‌కు శ్రీకారం చుట్టాడు. అనుష్క ప్రధాన పాత్రలో యువి క్రియేషన్స్ నిర్మించిన ఈ భారీ చిత్రం ఈనెల 26న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా దర్శకుడు అశోక్ చెప్పిన విశేషాలు...
అలా కుదిరింది..
ఈ కథను 2012లో యువి క్రియేషన్స్ నిర్మాతలకు చెప్పాను. వంశి, ప్రమోద్‌లకు కథ నచ్చడంతో ప్రభాస్‌కు చెప్పమన్నారు. కథ విన్న ప్రభాస్ కూడా బాగుందని, అనుష్కకు విన్పించమన్నాడు. కథ విన్న అనుష్క వెంటనే చేద్దామని ఓకె చేసింది. నిజానికి ఈ కథను బాహుబలి సినిమాకంటే ముందు చెప్పాను. అయితే ఆమె బాహుబలి సినిమాకు ఇచ్చిన కమిట్‌మెంట్‌తో బిజీగా వుండడంవల్ల అప్పుడు చేయడం కుదరలేదు. మధ్యలో రెండుసార్లు మొదలుపెడతామని అనుకున్నా కుదరలేదు.
యూనివర్సల్ కథ..
ఇది యూనివర్సల్ సబ్జెక్ట్. ఏ నేపథ్యానికైనా సరిపోతుంది. దీనికి భాషా భేదం లేదు. ఏ భాషలోనైనా చేయవచ్చు. అందరికీ పరిచయమున్న కథలాంటిదే. ప్రతీ విషయాన్ని ఆడియెన్స్ కనెక్ట్ అవుతారు.
అనుష్క లేకుంటే..
భాగమతి కథను అనుకున్న తరువాత అనుష్క తప్ప మరెవరినీ ఊహించుకోలేదు. ఎందుకంటే ఈ తరహా పాత్ర చేయాలంటే ఒక్క స్టేచర్ ఉన్న నటి కావాలి. ప్రేక్షకుల్లో ఆమెకు అలాంటి గుర్తింపు ఉండాలి. ఇవన్నీ కూడా నాకు అనుష్కలోనే కన్పించాయి. అందుకే ఆమెను తప్ప వెరెవరినీ అడగలేదు. అనుష్క చేయనంటే ఈ సినిమా చేసి ఉండేవాడిని కాదు.
భారీ సెట్..
ఈ సినిమా కోసం 400 ఏళ్ల నాటి బంగళా అవసరం. అది కూడా రాజుల నేపథ్యంలో కావాలి. అలాంటిదానికోసం చాలా తిరిగాం. ఎక్కడా దొరకలేదు. దాంతో ఆర్ట్ డైరెక్టర్ రవిందర్ అద్భుతమైన సెట్ వేశాడు. సెట్ అంటే కథలో కూడా ఓ పాత్ర కావాలి. కథ మొత్తం ఎక్కువగా ఆ బిల్డింగ్‌లోనే జరుగుతుంది.
లేడీ ఓరియెంటెడ్ కాదు..
ఇది అందరూ అనుకున్నట్టు లేడీ ఓరియెంటెడ్ సినిమా కాదు. స్క్రీన్‌ప్లే నేపథ్యంతో సాగే కథ. ఈ సినిమా కోసం అనుష్క చాలా కష్టపడ్డారు. కొన్ని సన్నివేశాల్లో దెబ్బలు తగిలినా కూడా చాలా ఓపిగ్గా సినిమా చేశారు. ఆమె కెరీర్‌లో భాగమతి నిలిచిపోయే సినిమా అవుతుంది.
తదుపరి చిత్రాలు..
ప్రస్తుతానికి భాగమతిపైనే దృష్టిపెట్టాము. ఈ సినిమా విడుదల తరువాత తదుపరి చిత్రాల గురించి ఆలోచిస్తా.

- శ్రీనివాస్ ఆర్.రావ్