ఫస్ట్‌లుక్‌లో ఇట్లు..అంజలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కార్తికేయ, హిమాన్షి, సుభాంగి పంతే ముఖ్యపాత్రల్లో నవీన్ మనె్నల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇట్లు అంజలి’. ఈ చిత్ర ఫస్ట్‌లుక్ ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. సీనియర్ జర్నలిస్టు పసుపులేటి రామారావు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాత నవీన్ మాట్లాడుతూ- ప్రేమలేఖ ఆధారంతో తెరకెక్కించిన థ్రిల్లర్ సబ్జెక్ట్ ఇది. అంజలి అనే పేరుగల అమ్మాయి రాసిన ప్రేమలేఖ, అదే పేరుగల మరో అమ్మాయి జీవితాన్ని ఎలా మార్చేసింది అనే ఆసక్తికర అంశాలతో తెరకెక్కింది. సాధారణంగా ప్రేమ విషయంలో అబ్బాయిలే ముందడుగు వేస్తుంటారు. అందుకుగాను ప్రేమమీద అబ్బాయిల, అమ్మాయిల భావనలు, ఊహలు ఎలా వుంటాయో, ఆ ఊహలు నిజమైతే జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుంది లాంటి అనేక అంశాలు ఇందులో వుంటాయి. నటీనటుల పెర్‌ఫార్‌మెన్స్ అద్భుతంగా వుంది. సినిమా అనుకున్నది అనుకున్నట్లుగా తెరకెక్కించాం. తప్పకుండా సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో హీరో హీరోయిన్లతోపాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.