‘ఇంటిలిజెంట్’ వస్తున్నాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్, లావణ్య త్రిపాఠి జంటగా ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ దర్శకత్వంలో సి.కె ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సి.కల్యా ణ్ నిర్మించిన ‘ఇంటిలిజెంట్’ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఫిబ్రవరి 9న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత సి.కల్యాణ్ మాట్లాడుతూ- ఫిబ్రవరి 9న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. సంక్రాంతికి బాలయ్య జై సింహాతో హిట్ కొట్టాం. ఫిబ్రవరిలో కూడా మరో హిట్ కోసం సిద్ధమవుతున్నాం. మాస్‌తోపాటు ఫ్యామిలీకి నచ్చే మంచి ఎంటర్‌టైనర్ ఇది. నేను గర్వంగా చెప్పుకొనే సినిమా అవుతుంది. నిన్ననే సినిమా చూశాను. చాలా బాగా నచ్చింది. సాయిధరమ్ డాన్సులు అదరగొట్టాడు. ‘ఇంటిలిజెంట్’గా హిట్ కొట్టేందుకు సిద్ధమవుతున్నాం అన్నారు. దర్శకుడు వినాయక్ మాట్లాడుతూ- సి.కల్యాణ్ బ్యానర్‌లో సినిమా చేయమని నాన్నగారు చెప్పారు. ఈ బ్యానర్‌లో చేయడం సంతోషంగా వుంది. ఆయన నిర్మాతగా కాకుండా ఒక అన్నయ్యలా సపోర్టు అందించాడు. కృష్ణ సినిమాలోలాగా ఇందులో అన్నిరకాల అంశాలు వుంటాయి. తేజు చాలా ఈజ్‌గా చేశాడు. ఇందులో కొండవీటి దొంగలోని ‘చమక్కు చమక్కు’ పాటను రీమిక్స్ చేశాం. దానికి తేజు డాన్సులు అదరకొట్టాడు. ఆకుల శివ మంచి కథ ఇచ్చాడు. తప్పకుండా మా కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుంది అన్నారు. హీరో సాయిధరమ్ మాట్లాడుతూ- సినిమా ఎప్పుడు మొదలుపెట్టామో ఎప్పుడు పూర్తి అయిందో తెలియలేదు. ఖైదీ నెం.150 తరువాత వినాయక్ నాతో సినిమా చేయడం ఆనందంగా వుంది. మంచి పాత్ర కుదిరింది. డబ్బింగ్‌లో కొన్ని సన్నివేశాలు చూసి నేనే షాక్ అయ్యాను. నాతోపాటు అదే రోజు విడుదలవుతున్న వరుణ్ తేజ్‌కు కూడా మంచి హిట్ రావాలి అన్నారు. లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ- ఈ సినిమాలో నటించడం ఆనందంగా వుంది అన్నారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం, నాజర్, పోసాని, కాశీ విశ్వనాధ్, ఆశీష్ విద్యార్థి, షాయాజీ షిండే, రాహుల్ దేవ్, దేవ్‌గిల్, వినీత్, జెపి, పృధ్వీ, రఘుబాబు, కాదంబరి కిరణ్, తా.రమేష్, సప్తగిరి తదితరులు నటిస్తున్నారు.