రియల్ హీరో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళంతోపాటు తెలుగులోనూ మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో సూర్య. ఆయన ఇటీవల గ్యాంగ్ సినిమాతో టాలీవుడ్‌లోనూ సక్సెస్‌ను అందుకున్నారు. ప్రస్తుతం ఆయన తన తర్వాతి చిత్రం కోసం సిద్ధమవుతున్నారు. కె.వి.ఆనంద్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. కాగా ఈ నూతన చిత్రంలోని పాత్రకోసం దర్శక నిర్మాతలు బాలీవుడ్ నటుడు అమితాబ్‌బచ్చన్ కలిశారని ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ విషయం గురించి ఓ ప్రముఖ తమిళ చానల్ షోలో ఇద్దరు మహిళా యాంకర్లు మాట్లాడారు. సింగం సినిమాలో సూర్యకన్నా అనుష్క ఎత్తుగా ఉన్నారని, ఇపుడు అమితాబ్‌బచ్చన్‌ను తీసుకున్నా అదే జరుగుతుందని వ్యంగ్యం విసిరారు. సూర్య అనుష్కతో నటించినపుడు హీల్స్ వేసుకున్నారని, ఇపుడు అమితాబ్‌తో నటించాలంటే స్టూల్ వేసుకోవాలని నవ్వుతూ ఎద్దేవా చేశారు. ఈ షో వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తమ అభిమాన హీరోను అవమానించారంటూ అభిమానులు ఆ చానల్‌పై, యాంకర్లపై తీవ్రంగా మండిపడ్డారు. అంతేకాదు ఆ చానల్ ఎదుట ఆందోళన చేశారు. ప్రముఖ హీరో విశాల్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘ఇది ఏ మాత్రం ఫన్నీ కాదు. వినోదం కోసం చెప్పే మాటలా ఇవి. పూర్తిగా బుద్ధిలేని వ్యాఖ్యలు’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ వివాదం ముదరడంతో సూర్య కూడా వెంటనే స్పందించారు. ఇలాంటి చిన్న స్థాయి విమర్శలకు స్పందించి మన విలువను తక్కువ చేసుకోకూడదు అని పేర్కొన్నారు. మీ సమయాన్ని, శక్తిని అవసరమైన పనుల కోసం ఉపయోగించండి అని అభిమానులను ఉద్దేశించి సూర్య చేసిన ట్వీట్ అందర్నీ విశేషంగా ఆకట్టుకవడమేగాక, సూర్య ది గ్రేట్! అని పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు కూడా. సూర్య రీల్ హీరోనే కాదు.. రియల్ హీరో కూడా అంటున్నారు.