యదార్థ సంఘటనలతో ‘స్కెచ్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విక్రమ్, తమన్నా జంటగా విజయ్‌చందర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం స్కెచ్. ఇటీవలే తమిళంలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత డి.సురేష్‌బాబు మాట్లాడుతూ- సెన్సార్ పూర్తికాగానే స్కెచ్ సినిమా విడుదల తేదీ ప్రకటిస్తాం. విక్రమ్ నాకు చాలా మంచి స్నేహితుడు. తను చిన్న రేంజ్ నుండి పెద్ద స్టార్‌గా ఎదిగారు. తమన్ మంచి మ్యూజిక్ అందించారు. సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను అన్నారు. విజయ్‌చందర్ మాట్లాడుతూ- తమిళంలో విడుదలైన ‘స్కెచ్’ చిత్రం పెద్ద సక్సెస్ అయ్యింది. తెలుగులో కూడా విజయం సాధిస్తుందని కోరుకుంటున్నా అన్నారు. తమన్నా మాట్లాడుతూ- నాకు స్కెచ్ ప్రత్యేకమైన సినిమా. విక్రమ్‌తో పని చేయాలని కెరీర్ ప్రారంభం నుండి అనుకున్నాను. 10 సంవత్సరాల తర్వాత ఆయనతో కలిసి నటించే అవకాశం కలిగింది. కమర్షియల్ ఎలిమెంట్స్ ఆధారంగా ఈ సినిమా చేశారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా అవుతుంది. నాకు, విక్రమ్ మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు చాలా చక్కగా వచ్చాయి. మెమరబుల్ మూవీగా నిలిచిపోతుంది అన్నారు. విక్రమ్ మాట్లాడుతూ- తమిళం, కేరళ, కన్నడంలో సినిమా పెద్ద హిట్ అయింది. తెలుగులో కూడా తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. సురేష్‌బాబు సినిమాను విడుదల చేస్తుండడం ఆనందంగా వుంది. పదిహేనేళ్ల తరువాత కమర్షియల్ సినిమా చేశాను. అలాగని రెగ్యులర్ కమర్షియల్ చిత్రం కాదు. యదార్థ ఘటనలతో తెరకెక్కించిన కమర్షియల్ మూవీ. దర్శకుడు విజయ్ సినిమాను చక్కగా తెరకెక్కించారు. చిన్న మెసేజ్ కూడా వుంటుంది అన్నారు.