‘చల్తే చల్తే’ ఫస్ట్‌లుక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిట్టగోడ ఫేం విశ్వదేవ్ రాచకొండ, ప్రియంక జైన్ జంటగా అమేజింగ్ ఆర్ట్ పతాకంపై శ్రీనివాసరావు పొట్లూరి, ప్రదీప్ కుమార్ కోనేరు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘చల్తే చల్తే’. ప్రదీప్ కె.కె దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ క్యూట్ లవ్‌స్టోరీ ఫస్ట్‌లుక్ ఇటీవల విడుదలైంది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు - సంగీత దర్శకుడు ప్రదీప్.కె.కె మాట్లాడుతూ- ఒక క్యూట్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన చిత్రం చల్తే చల్తే. విశ్వదేశ్ రాచకొండకు హీరోగా మంచి గుర్తింపునిచ్చే చిత్రమిది. విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్‌కి మంచి ప్రశంసలు లభించాయి. త్వరలో టీజర్ విడుదల చేసి, ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించనున్నాం. చిత్రాన్ని ఫిబ్రవరిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. రావు రమేష్, షాయాజీ షిండే, వి.కె.నరేష్, రాజశ్రీ నాయర్, ప్రగతి, ఉత్తేజ్, దువ్వాసి, మోహన్, సూర్య, గౌతమ్‌రాజు తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కళ: వై.నాగు, కొరియోగ్రఫి: భాను, స్టంట్స్: శ్రీ, కెమెరా: డి.ఆర్.వెంకట్, ఎడిటింగ్: ఉపేంద్ర, నిర్మాతలు: శ్రీనివాసరావు పొట్లూరి, ప్రదీప్‌కుమార్ కోనేరు, సంగీతం, దర్శకత్వం: ప్రదీప్ కె.కె.