‘మోహిని’ పై ఆశలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దశాబ్దకాలంగా టాప్ హీరోయిన్‌గా సౌత్‌లో ఓ వెలుగు వెలిగిన అందాల భామ త్రిషకు ఈమధ్య సెకెండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టినా కూడా పెద్దగా కలిసిరావడంలేదు. ఎన్నో ఆశలు పెట్టుకొని చేసిన రెండు మూడు చిత్రాలు భారీ పరాజయాలు చవిచూడడంతో త్రిషకు అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతం చేస్తున్న సినిమాలు కూడా విడుదల విషయంలో ముందుకు కదలడంలేదు. దానికి కారణం త్రిషకు మార్కెట్ లేకపోవడమే. మొత్తానికి మోహిని పేరుతో మరో హర్రర్ చిత్రంలో నటించిన త్రిష, ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకుంది. ఖచ్చితంగా మోహిని మళ్లీ తన క్రేజ్‌ని తీసుకొస్తుందనే ఆశతో వుంది. ఈ సినిమా విడుదలకోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్న త్రిష, ఈ సినిమా గురించి గొప్పగానే చెప్పుకుంటోంది. ఖచ్చితంగా ప్రేక్షకులకు కొత్త అనుభూతితోపాటు తప్పకుండా భయపెడతానని చెబుతోంది. మరి త్రిష ఆశలను మోహిని నెరవేరుస్తుందేమో చూడాలి!