2న ‘టచ్ చేసి చూడు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన చిత్రం ‘టచ్ చేసి చూడు’. బేబి భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీ సంయుక్తంగా నిర్మించిన చిత్రమిది. విక్రమ్ సిరికొండ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రాశీకన్నా, సీరత్‌కపూర్ నాయికలు. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని యు/ఎ సర్ట్ఫికెట్‌ను పొందింది. ఫిబ్రవరి 2న ఈచిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ- చిత్రం సెన్సార్ పూర్తయింది. యు/ఎ సర్ట్ఫికెట్ వచ్చింది. ఈ వారంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహిస్తాం. ఇటీవల సోషల్ మీడియా ద్వారా విడుదల చేసిన పాటలకు, టీజర్‌కు మంచి ఆదరణ వస్తోంది. రవితేజ చాలా స్టయిలిష్‌గా కనిపిస్తున్నారని అందరూ ప్రశంసిస్తున్నారు. వక్కంతం వంశీ అద్భుతమైన కథను తయారుచేసి ఫిబ్రవరి 2న సినిమా విడుదలవుతుంది అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: జామ్ 7, కథ: వక్కంతం వంశీ, స్క్రీన్‌ప్లే: దీప్‌రాజ్, మాటలు: శ్రీనివాస్‌రెడ్డి, ఎడిటింగ్: గౌతంరాజు, ఆర్ట్: రమణ, కెమెరా: చోటా కె నాయుడు, నిర్మాతలు: నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభేని, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విక్రమ్ సిరికొండ.