డామినేట్ చేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ సినిమా విజయాన్ని నేను సరిగ్గా ఉపయోగించుకోలేదు. అంత మంచి హిట్ వచ్చినా నేను రియలైజ్ కాలేదని అంటోంది సీరత్‌కపూర్! ‘రన్ రాజా రన్’ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అందాల భామ సీరత్‌కపూర్, ఆ సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది. గ్లామర్ హీరోయిన్‌గా పలు అవకాశాలు అందుకున్న ఈమె, తాజాగా రవితేజ సరసన ‘టచ్ చేసి చూడు’ చిత్రంలో నటిస్తోంది. విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫిబ్రవరి 2న విడుదలవుతున్న సందర్భంగా హీరోయిన్ సీరత్‌కపూర్‌తో ఇంటర్వ్యూ...
రవితేజతో పనిచేయడం ఎలా వుంది?
- రవితేజ లాంటి మాస్ హీరోతో పనిచేయడం ఆనందంగా వుంది. తను చాలా ఉత్సాహంగా వుంటూ మంచి సపోర్టు అందిస్తాడు. పరిశ్రమలో అంత పెద్ద స్టార్ ఇమేజ్ వున్నా అంత సింపుల్‌గా వుండడం మామూలు విషయం కాదు.
* మీ పాత్ర గురించి?
- ఇందులో నా పాత్ర చాలా కొత్తగా వుంటుంది. ఒకరకంగా హీరోనే డామినేట్ చేసే పాత్ర అది. హీరోకి ఏం చేయాలో ఎలా వుండాలో చెబుతూ వుంటాను.
* సెకెండ్ హీరోయిన్‌గానే చేస్తున్నారు?
- ఈ చిత్రంలో నేను సెకెండ్ హీరోయిన్‌ను కాదు. ఒక ముఖ్యమైన పాత్ర. ఏ సినిమా విషయంలోనైనా నాకు కథ, నా పాత్ర ముఖ్యం. పాత్ర బాగుంటే ఫస్టా, సెకెండ్ హీరోయినా అని చూడను.
* సందేశాన్ని ఇస్తున్నారా?
- నేను సినిమా చూడలేదు. కానీ దేశాన్ని కాపాడటానికి ఓ పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తాడు? అనేది కథ. ఇందులో పోలీసుల ప్రాముఖ్యత గురించి బాగా ప్రస్తావించారు. ఎంటర్‌టైన్‌తోపాటు చిన్న సందేశం కూడా వుంటుంది.
* ఈ సినిమాతో మీకెలాంటి క్రేజ్ దక్కుతుందనుకుంటున్నారు?
- తప్పకుండా ఈ సినిమాతో నా క్రేజ్ మారుతుంది. నిజానికి ‘రన్ రాజా రన్’ లాంటి సక్సెస్‌ఫుల్ సినిమా చేసినపుడు దాన్ని రియలైజ్ కాలేకపోయాను. దానివల్ల కొన్ని సినిమాలు మిస్ అవ్వాల్సి వచ్చింది. ఈ సినిమా తప్పకుండా నా కెరీర్‌కు ప్లస్ అవుతుందని భావిస్తున్నాను.
* తర్వాతి ప్రాజెక్ట్సు?
- సురేష్ ప్రొడక్షన్‌లో రవికాంత్ పేరేపు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నా