లెక్కల మాస్టారుతో..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భిన్నమైన కథా చిత్రాలతో దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సుకుమార్. తాజాగా ఆయన ‘రంగస్థలం’ సినిమాతో మరో భిన్నమైన ప్రయోగానికి సిద్ధమయ్యాడు. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం టీజర్ అందరినీ ఆకట్టుకుని దూసుకుపోతోంది. రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మార్చి 30న విడుదల చేస్తున్నారు. ఈ సినిమా తరువాత సుకుమార్ మరో భారీ చిత్రానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈసారి ఆయన సినిమా చేసేది ఎవరో తెలుసా? మెగాస్టార్ చిరంజీవితోనట! ఇప్పటికే చిరంజీవికోసం ఓ కథను సిద్ధం చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా మెగాస్టార్‌కి ఓ లైన్ కూడా వినిపించినట్టు, కథ విన్న చిరంజీవి స్క్రిప్ట్‌తో రమ్మని చెప్పాడని టాక్. ఈ నేపథ్యంలో చరణ్ సినిమా అయిపోగానే ఈ లెక్కల మాస్టారి తదుపరి సినిమా మెగాస్టార్‌తోనే వుంటుందని సన్నిహిత వర్గాల సమాచారం. ప్రస్తుతం చిరంజీవి సైరాతో బిజీగా వున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తరువాత సుకుమార్ సినిమా పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.