నాగశౌర్య లాంటి హీరోలు రావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువ హీరో నాగశౌర్య, రష్మిక మండన్న జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో శంకర్‌ప్రసాద్ సమర్పణలో ఐరా క్రియేషన్స్ బ్యానర్‌పై ఉషా ముల్పూరి నిర్మిస్తున్న ‘్ఛలో’ చిత్రంలోని పాటలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. మెగాస్టార్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆడియో సీడీని విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ- నాగశౌర్య నన్ను కలవడానికి చాలాసార్లు మా ఆఫీసుకు వచ్చాడు. నేను లేకపోవడంతో కలవలేదు. ఒక రోజు వాళ్ల అమ్మతో వచ్చి ప్రీ రిలీజ్ వేడుక చేస్తు న్నాం, రమ్మన్నారు. వెంటనే వస్తానని చెప్పాను. దానికి కారణం కెరీర్ బిగినింగ్‌లో నా సినిమా వందరోజుల ఫంక్షన్‌కు స్టార్ హీరో రావాలని ఆశపడతాం. ఆ ఉత్సాహం ప్రోత్సాహం వేరు. అందుకే ఈ వేడుకకు వచ్చాను. నాగశౌర్య చేసిన ‘ఒక్క మనసు’ చూశాను. తను చాలా అందంగా, స్మార్ట్‌గా ఉన్నాడు. ఇలాంటి హీరోలు ఖచ్చితంగా చిత్ర పరిశ్రమకి రావాలి. అప్పుడే పరిశ్రమలో కొత్త ఉత్సాహం ఫ్రెష్‌నెస్ కనిపిస్తుంది. ఒలంపిక్స్‌లో కొత్త ఉత్సాహంతో ప్లేయర్ ఎలా పరుగులు పెడతాడో నాగశౌర్య లాంటి నటులు వస్తే కొత్త ఉత్సాహం ఉంటుంది. ఈమధ్య యువ హీరోల సినిమాలు పెద్ద విజయాలను అందుకుంటున్నాయి. ఉయ్యాల జంపాలా, పెళ్లిచూపులు, ఊహలు గుసగుసలాడే, ఫిదా, శతమానం భవతి, అర్జున్‌రెడ్డి లాంటి చిత్రాల తరహాలో ‘్ఛలో’ కూడా మంచి విజయం సాధించాలి అన్నారు. హీరో నాగశౌర్య మాట్లాడుతూ- నేను చాలా చిన్నవాణ్ణి. చిరంజీవిగారి చేయి నామీద పడింది. ఇది చాలు.. ఎప్పటికైనా మెగాస్టార్ అభిమానిగానే పుడతాను. నన్ను సపోర్టు చేయడానికి వచ్చిన చిరంజీవి గారికి కృతజ్ఞతలు అన్నారు. దర్శకుడు వెంకీ మాట్లాడుతూ- చిరంజీవి గారికున్న అశేషమైన అభిమాన భక్తుల్లో నేనూ ఒకడిని. ఇంద్ర, ఠాగూర్ లాంటి సినిమాలకు కటౌట్లు కట్టాను. నా సినిమా వేడుకకు రావడం అదృష్టంగా భావిస్తున్నా అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత సి.కల్యాణ్, నందినిరెడ్డి, వంశీ పైడిపల్లి పాల్గొన్నారు.