వచ్చేశాడు భరత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘భరత్ అను నేను’. కొరటాల శివ దర్శకత్వంలో ‘శ్రీమంతుడు’ వంటి సంచలన విజయం తరువాత వస్తోన్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా రిపబ్లిక్‌డే సందర్భంగా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. పొలిటికల్ డ్రామా నేపథ్యంలో సాగే కథగా వుంటుందని, ఇందులో మహేష్ ముఖ్యమంత్రిగా కనిపిస్తాడని వార్తలు వస్తున్నాయి. తాజాగా విడుదల చేసిన మహేష్ ఫస్ట్‌లుక్ కూడా ఆకట్టుకనేలా వుంది. మహేష్ సరసన కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పేరుతో నిమిషం వున్న ఆడియోను విడుదల చేశారు. మహేష్‌బాబు ప్రమాణ స్వీకారం చేస్తున్నట్టుగా వున్న ఆడియో అందరినీ అట్రాక్ట్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దేవిశ్రీ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 27న విడుదల చేయనున్నారు.