శ్రీకాంత్ ఆపరేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాంత్, యజ్ఞశెట్టి జంటగా కరణం బాబ్జి దర్శకత్వంలో అలివేలమ్మ ప్రొడక్షన్స్ పతాకంపై అలివేలు నిర్మిస్తున్న చిత్రం ‘ఆపరేషన్ 2019’. బివేర్ ఆఫ్ పబ్లిక్ అనే ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్ర టీజర్‌ను హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న సీనియర్ నటుడు కృష్ణంరాజు టీజర్‌ను లాంఛ్ చేసి అనంతరం మాట్లాడుతూ- శ్రీకాంత్ నాకు తమ్ముడిగా, కొడుకుగా కూడా నటించాడు. తను మంచి నటుడే కాదు మనసున్న వ్యక్తి. గతంలో చేసిన ఆపరేషన్ దుర్యోధన మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇప్పుడు చేస్తోన్న ఆపరేషన్ 2019 టీజర్ బాగుంది. బివేర్ ఆఫ్ పబ్లిక్ క్యాప్షన్ చూసిన తరువాత నాకో విషయం గుర్తుకువచ్చింది. ప్రస్తుతం రాజకీయాల్లోకి వ్యాపారవేత్తలు ప్రవేశిస్తున్నారు. దాంతో ప్రజల్లో కూడా డబ్బుపై ఆశ పెరిగింది. కాబట్టితో జాగ్రత్తగా వుండాలి. వాళ్లని మార్చే విధంగా సినిమాలు రావాలి. తప్పకుండా వీరి ప్రయత్నం ఫలించాలి అన్నారు. నటుడు శివకృష్ణ మాట్లాడుతూ- ఇందులో ఓ మంచి పాత్ర పోషించాను. దర్శకుడికి మంచి క్లారిటీ వుంది. తప్పకుండా చాలా భిన్నమైన సినిమా ఇది అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ- శ్రీకాంత్‌తో గతంలో మెంటల్ పోలీస్ చిత్రాన్ని తీశాను. ఆ టైటిల్ వివాదం కావడం, విడుదల సమయంలో సమస్యలు నెలకొనడంతో అనుకున్న విజయం రాలేదు. దాంతో మళ్లీ శ్రీకాంత్‌తో ఈ చిత్రాన్ని చేస్తున్నాను. నన్ను నమ్మి ఆయన ఎంతగానో సహకరిస్తున్నారు. ఈనెల 29 నుంచి ఫిబ్రవరి 6 వరకు జరిగే షూటింగ్‌తో చిత్రం పూర్తవుతుంది అన్నారు. శ్రీకాంత్ మాట్లాడుతూ- కృష్ణంరాజు ఈ వేడుకకు రావడం ఆనందంగా వుంది. ఆయనతో నాకు మంచి అనుబంధం వుంది. కరణం బాబ్జి మంచి కథతో ఈ చిత్రం చేశాడు. మెంటల్ పోలీస్ సినిమాల వివాదాలు లేకుండా సినిమా చేద్దామని ఆపరేషన్ 2019 చేశాం. ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది అన్నారు. ఈ చిత్రానికి సంగీతం:షకీల్, ఎడిటింగ్:ఉద్ధవ్, ఆర్ట్:జె.కె.మూర్తి, కెమెరా:వెంకట ప్రసాద్, నిర్మాత: అలివేలు, దర్శకత్వం:కరణం బాబ్జి.