‘ఇంటిలిజెంట్’ టీజర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై.లిమిటెడ్ పతాకంపై వి.వి వినాయక్ దర్శకత్వంలో సి. కళ్యాణ్ నిర్మిస్తున్న చిత్రం ‘ఇంటిలిజెంట్’. ఈ చిత్రం టీజర్‌ను నందమూరి బాలకృష్ణ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో హీరో సాయిధరమ్ తేజ్, దర్శకుడు వి.వి.వినాయక్, నిర్మాత సి.కళ్యాణ్, రచయిత శివ ఆకుల పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ - ‘ సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో మా సి.కళ్యాణ్ గారు, వి.వి.వినాయక్ దర్శకత్వంలో నాలుగో సినిమా ఇది. వినాయక్ కాంబినేషన్‌లో ఇంతకు ముందు ‘చెన్నకేశవరెడ్డి’ చిత్రం చేశాం. మన కాంబినేషన్‌లో సినిమా ఎప్పుడు అని అడుగుతుంటాను. సినిమా విషయంలో ఆయన ఇన్‌వాల్వ్‌మెంట్, కలుపుగోలుతనం, ఆర్టిస్టు నుంచి సరైన పెర్‌ఫార్మెన్స్ రాబట్టుకోవడం ఆయనకు తెలుసు. ఇండస్ట్రీ గర్వించ దగ్గ దర్శకుడు వి.వి.వినాయక్. ఆయన దర్శకత్వంలో మెగా ఫ్యామిలీ నుంచి మరో నటవారసుడు సాయిధరమ్ తేజ్ హీరోగా రూపొందిన చిత్రం ‘ఇంటిలిజెంట్’. ఈ సినిమా టీజర్‌ని నా చేతుల మీదుగా విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ నా సొంత బ్యానర్‌తో సమానం. కళ్యాణ్‌గారు పెద్ద హీరోలతో, చిన్న హీరోలతో ఇంకా సినిమాలు చేయాలి. ఈ సినిమా విషయానికొస్తే వినాయక్, శివ కాంబినేషన్‌లో ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయి. ఈ సినిమా టీజర్ చాలా బాగుంది. మిస్టీరియస్‌గా వుంది. టీజర్ చూసిన తర్వాత సినిమా ఎప్పుడు చూడాలా అనిపిస్తుంది. టైటిల్ కూడా చాలా బాగుంది. మెగా అభిమానులకు, ఇది నా బ్యానర్ కాబట్ని అభిమానులకు, ముఖ్యంగా యూత్‌కి ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. సినిమా ఘన విజయం సాధిస్తుంది’ అన్నారు. నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ - ‘నా నందమూరి అభిమానులకు, మెగా చిరంజీవిగారి ఫ్యామిలీ హీరో సాయిధరమ్ తేజ్ అభిమానులకు, ప్రేక్షకులకు నమస్కారం. ఇదొక సెనే్సషన్. నాకు చాలా పెద్ద హిట్ ఇచ్చిన మా హీరో బాలకృష్ణగారు. అలాగే గురువుగారి 150వ సినిమాకి నిర్మాతనయ్యే అవకాశం ఆరోజు నాకు ఇచ్చారు. అది చాలా గ్రేట్. ఈ సంక్రాంతికి ‘జై సింహా’తో పెద్ద హిట్ ఇచ్చారు. చాలా తక్కువ టైమ్‌లో రాత్రింబవళ్లు కష్టపడి పని చేసి సక్సెస్ కొట్టాం. అవన్నీ ఒక ఎత్తయితే వినాయక్ నాన్నగారు కృష్ణ కోరిక వినయ్ నాతో ఒక సినిమా చేయాలని. చెన్నకేశవరెడ్డి ఫస్ట్ ప్రొజెక్షన్ ప్రసాద్ ల్యాబ్‌లో జరుగుతోంది. అప్పుడు వినయ్ నాన్నగారితో విషయం చెబితే నాకు వదిలెయ్ నేను చూసుకుంటాను. ఇప్పుడు నాతో సినిమా చేయడం ద్వారా వినయ్ నా కోరికను నెరవేర్చాడు. తేజు ఈ సినిమా ఎంతో కష్టపడి చేశారు. మా తండ్రిగారు దాసరి నారాయణరావుగారి దీవెనలు, అన్నయ్య కృష్ణ దీవెనలు మాకు ఉంటాయి. వీటన్నింటిని మించి మా బాలయ్య బాబు ఆశీస్సులు అందించేందుకు రావడం.. నేను చాలా చాలా పెద్ద సెనే్సషన్ హిట్ కొట్టినట్టు భావిస్తున్నాను. టీజర్ విడుదల చేయవలసిందిగా బాబుని అడగడానికి వెళ్లినప్పుడు ఒక టైమ్ చెప్పి అప్పుడు టీజర్ విడుదల చేయండి, సినిమా సూపర్‌హిట్ అన్నారు. 2018 ప్రారంభంలో బాలకృష్ణ గారు నాకు మంచి ఎనర్జీ ఇచ్చారు. ఫిబ్రవరిలో కూడా సూపర్‌హిట్ కొట్టి సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ వుందని నిరూపిస్తాను’ అన్నారు. దర్శకుడు వి.వి.వినాయక్ మాట్లాడుతూ - ‘మేం అడగ్గానే బాలకృష్ణగారు రావడంతో ఈ సినిమా సూపర్‌హిట్ అయిపోయిందన్న ఫీలింగ్ వచ్చేసింది. మేమంతా ఆనందంతో ఉద్వేగంగా ఉన్నాం. యూనిట్‌లోని ప్రతీ ఒక్కరి తరఫున బాలకృష్ణగారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం’ అన్నారు. హీరో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ - ‘ముందుగా బాలకృష్ణగారికి థాంక్స్. కొత్త టాలెంట్‌ని ప్రోత్సహించడంలో ఆయన ముందుంటారని అందరూ అంటారు. మా సినిమాకి ఆశీస్సులు అందించడానికి రావడంతో మరోసారి అది ప్రూవ్ అయింది’ అన్నారు. ఈ ‘ఇంటిలిజెంట్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకను ఫిబ్రవరి 4న రాజమండ్రిలోని గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో ఘనంగా నిర్వహించనున్నారు.