బాలీవుడ్ జోరులో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సౌత్‌లో క్రేజీ హీరోయిన్‌గా మంచి ఇమేజ్ తెచ్చుకున్న అందాల భామ రకుల్ ప్రీత్‌సింగ్‌కు ఈ మధ్య తెలుగులో కాస్త అవకాశాలు తగ్గాయి. దానికి కారణం ఈ అమ్మడు చేసిన సినిమాలన్నీ వరుసగా పరాజయం పాలవడంతో కొత్త అవకాశాలు తగ్గాయి. దాంతో ఈ బ్యూటీ అటు బాలీవుడ్‌లో కూడా ఓ సినిమా చేస్తుండడంతో ప్రస్తుతం ఫోకస్ అంతా బాలీవుడ్‌పై పెట్టింది. హిందీలో ఆయారి పేరుతో తెరకెక్కిన ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధం అయింది. ఈ నేపథ్యంలో అక్కడ ప్రమోషన్ జోరుగా మొదలు పెట్టారు. సో..రకుల్ కూడా సినిమా ప్రమోషన్ విషయంలో బిజీగా మారడమే కాకుండా తెలుగులో వస్తున్న అవకాశాల గురించి కూడా పెద్దగా పట్టించుకోవడం లేదట. అంటే ఈమె ఉద్దేశ్యం బాలీవుడ్‌లో హీరోయిన్‌గా సెటిల్ అవ్వాలని ప్లాన్ వేసినట్టుంది. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ట్రైలర్ కూడా విడుదల చేశారు. ఇందులో రకుల్ కూడా యాక్టివ్‌గానే కనిపిస్తుంది. సో త్వరలోనే విడుదల కానున్న ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్న ఈ అమ్మడి కోరికను అయారి నెరవేరుస్తుందో లేదో చూడాలి!