వెంకటేష్ చిత్రంలో కొత్త నటులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తేజ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా నటించబోతున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో మొదలుకానుంది. ఈ సినిమాలో వెంకటేష్ సరికొత్త పాత్రలో కనిపించబోతున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా కోసం కొత్త నటీనటులు కావాలని దర్శకుడు తేజ ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఈనెల 25 నుండి ఆడిషన్స్ జరిగాయి. తాజా సమాచారం మేరకు ఈ మూడు రోజుల్లో జరిగిన ఆడిషన్స్‌లో చాలా మంది కొత్త నటీనటులు ఎంపిక అయినట్లు తెలుస్తోంది. వెంకటేష్ వంటి టాప్ హీరో సినిమాలో నటించే అవకాశం రావడం అదృష్టమే. ఈ చిత్రంలో నటించబోయే హీరోయిన్స్ ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడి కానున్నాయి. నారా రోహిత్ ఈ సినిమాలో నటించబోతున్నట్లు తేజ ఇటీవల ఫేస్‌బుక్‌లో వెల్లడించారు.