ఎస్‌కెఎమ్‌ఎల్ మోషన్ పిక్చర్ షూటింగ్ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువరాజ్, సుమతలను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ ఎస్‌కెయమ్‌ఎల్ మోషన్ పిక్చర్స్ పతాకంపై కాండ్రేగుల ఆదినారాయణ ప్రొడక్షన్ నెం 3గా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా రావ్ దుర్గం దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మంగళవారం ఊటీలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ- యువరాజ్, సమతలను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ సోషియో ఫాంటసీ కథాంశంతో ఓ చిత్రాన్ని ప్రారంభించాం. త్వరలో టైటిల్ ప్రకటిస్తాం. ఊటితోపాటు హైదరాబాద్‌లో కూడా చిత్రీకరణ జరపనున్నాం. లవ్, కామెడీతోపాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే ఎలిమెంట్స్ ఉన్నాయి. కీలక పాత్రలో నాగబాబు నటిస్తున్నారు. రావ్ దుర్గంను ఈ చిత్రంద్వారా దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం. టాలెంటెడ్ టెక్నీషియన్స్‌ను తీసుకున్నాం. వీలైనంత త్వరగా సినిమాను పూర్తిచేసి సమ్మర్‌లో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. జబర్దస్త్ టీం నటిస్తోన్న ఈ చిత్రానికి కెమెరా:వెంకట్, సంగీతం:నాని, నిర్మాత:కాండ్రేగుల ఆదినారాయణ, దర్శకుడు:రావ్ దుర్గం.