ఆయన ప్రభావం ఉంటుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజానికి నాగశౌర్యతో క్రైమ్ కామెడీ చేద్దామని అనుకున్నాను. అయితే శౌర్య క్రైమ్ కామెడీని కాకుండా మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్ చేద్దామని అనడంతో.. తను ఇప్పటివరకు ఎవరూ చూపించని పాత్రలో అంటే ఫుల్ ఎనర్జిటిక్‌గా చూపిస్తే ఎలా వుంటుందని ఆలోచించాను. తనకు చెబితే చేద్దామని అన్నాడు. అశ్వారావుపేట నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఆంధ్రప్రదేశ్ వుంది. రెండు బోర్డర్స్ ప్రక్కనే ఉండటంతో ఈ కథను చేస్తే బావుంటుందనిపించి కథను తయారుచేశాను.
నాగశౌర్య, రష్మిక మండన్న జంటగా ఐరా క్రియేషన్స్ పతాకంపై శంకర ప్రసాద్ ముల్పూరి సమర్పణలో వెంకీ కుడుముల దర్శకత్వంలో ఉషా ముల్పూరి నిర్మిస్తున్న చత్రం ‘్ఛలో’. ఈ సినిమా ఫిబ్రవరి 2న విడుదలవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు వెంకీ సినిమా గురించి పాత్రికేయులతో ముచ్చటించారు.
నా గురించి..
మాది ఖమ్మం జిల్లా అశ్వారావ్‌పేట. ఎంబిఏ చదివాను. తేజ డైరెక్షన్ టీంలో ‘నీకు నాకు డాష్ డాష్’ అనే సినిమాలో పనిచేశాను. అందులో చిన్న పాత్రలో కూడా నటించాను. తర్వాత జాదూగాడు సినిమా కోసం యోగితో పనిచేశాను. అలాగే తుఫాన్ తెలుగు వెర్షన్‌కు కూడా పనిచేశాను. తర్వాత త్రివిక్రమ్ వద్ద ‘అఆ’ సినిమాకు పనిచేశాను. బలభద్రపాత్రుని రమణి రచయితద్వారా తేజగారికి పరిచయం అయ్యాను. ‘జాదూగాడు’ సినిమాకు నేను అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నప్పటి నుండి నాగశౌర్యతో పరిచయం వుంది. తను నన్ను ఎలాగైనా డైరెక్టర్ చేయాలనుకున్నాడు. అలాగే నేను కూడా నా తొలి సినిమాను నాగశౌర్యతో చేయాలనుకున్నాను. అయితే తనతో సినిమా చేస్తానని చెబితే స్నేహం ఎక్కడ చెడుతుందోనని అనుకుంటుండేవాడిని. అలాంటి సమయంలో ‘అఆ’ సినిమా పూర్తయిన తరువాత ఓ రోజు శౌర్య ఫోన్ చేసి వెంకీ కథ తయారుచేసుకో. మనం సినిమా చేద్దామని అన్నాడు. నాకు చాలా సంతోషమేసింది.
అదే స్ఫూర్తి..
నిజానికి నాగశౌర్యతో క్రైమ్ కామెడీ చేద్దామని అనుకున్నాను. అయితే శౌర్య క్రైమ్ కామెడీని కాకుండా మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్ చేద్దామని అనడంతో.. తను ఇప్పటివరకు ఎవరూ చూపించని పాత్రలో అంటే ఫుల్ ఎనర్జిటిక్‌గా చూపిస్తే ఎలా వుంటుందని ఆలోచించాను. తనకు చెబితే చేద్దామని అన్నాడు. అశ్వారావుపేట నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఆంధ్రప్రదేశ్ వుంది. రెండు బోర్డర్స్ ప్రక్కనే ఉండటంతో ఈ కథను చేస్తే బావుంటుందనిపించి కథను తయారుచేశాను.
నాగశౌర్యతో సొంత సినిమా..
ముందు ఈ కథను వేరే నిర్మాతకు చెప్పాం. కథ బావుంది. లిమిటెడ్ బడ్జెట్‌లో చేద్దామని అన్నారు. ఈ సంగతి తెలిసిన నాగశౌర్య పేరెంట్స్ మంచి కథ అంటున్నారు, శౌర్య నమ్మకం పెట్టుకున్న కథను మనమే ఎందుకు చేయకూడదని ఆలోచించి.. కష్టమో నష్టమో వారే సినిమా నిర్మించడానికి ముందుకొచ్చారు. ఎంతో ఫ్రీడ్ ఇచ్చి సినిమా ఔట్‌పుట్ బాగా రావడానికి సపోర్టు చేసిన వారికి జీవితాంతం రుణపడి ఉంటాను.
రష్మికతో..
ఈ కథను డెవలప్ చేయడానికి చెన్నై వెళ్లాను. అక్కడ కన్నడ సినిమా కిరాక్ పార్టీ చూశాను. సినిమా బాగుంది. హీరోయిన్ చాలా బావుంది. బాగా నటించిందని అనుకుంటూ బయటకు రాగానే, శౌర్య ఫోన్ చేసి నీకొక లింక్ పంపాను, చూడు అన్నాడు. ఆ లింక్ మరేదో కాదు కిరాక్ పార్టీలోని సాంగే. నేను ఫోన్ చేసి నిర్మాతలకు చెప్పాను.
త్రివిక్రమ్ ప్రభావం ఇప్పుడు వస్తున్న యువ దర్శకులందరిపై త్రివిక్రమ్ ప్రభావం తప్పకుండా వుంటుంది.
అయితే ఆయన్ని ఇమిటేట్ చేయకూడదు. ఇక సినిమా విడుదల దగ్గర పడుతుంది, ఔట్‌పుట్ చూసుకున్నాం కాబట్టి ఏ ప్రెషర్ లేదు. ఇక నెక్స్ట్ సినిమా అంటారా.. ప్రస్తుతానికి చిత్రాలేవీ లేవు.. ‘్ఛలో’ సినిమా రిలీజ్ తర్వాత చూడాలి.

- శ్రీనివాస్ ఆర్ రావ్