బాలాజీ విజయోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లాణి శ్రీ్ధర్ స్వీయ దర్శకత్వంలో ఫిల్మీడియా ప్రొడక్షన్స్ ప్రై.లిమిటెడ్ పతాకంపై నిర్మించిన ‘శ్రీ చిలూకూరి బాలాజీ’ చిథ్రం ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణ వంశీ ఆర్ట్ థియేటర్స్ వారు ఈ చిత్రం ప్రదర్శింపబడుతున్న స్వప్న, సంతోష్ థియేటర్‌లో విజయోత్సవ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కె.వి రమణాచారి, హీరో సాయికుమార్, చిలూకూరి బాలాజీ, ప్రధాన అర్చకులు రంగరాజన్, దర్శకుడు అల్లాణి శ్రీ్ధర్, పంపిణీ దారులు రామసత్యనారాయణ, వింజమూరి మధు, డా. వారణాసి రామచందర్‌రావుతదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కథానాయకుడు సాయికుమార్ మాట్లాడుతూ - నేను తల్లి కడుపునుండే సినిమా వాడిని. నేను పుట్టింది చెన్నయ్‌లో అయనా అమ్మ, నాన్న ఇద్దరూ కళాకారులు కావడంతో చిన్నప్పటి నుండే దేశభక్తిని చక్కటి తెలుగును నాకు నేర్పించారు. చిలూకూరి బాలాజీ పురాణం కథాంశంగా రూపొందిన ఈ చిత్రంలో నేను మాధవరెడ్డి వేషం వేయడం నా పూర్వజన్మ సుకృతం. మన పుణ్య క్షేత్రాల గురించి మన సంప్రదాయాల గురించి మన సంస్కృతి గురించి భవిష్యత్ తరాల వారికి తెలియజే వలసిన అవసరం ఉంది అన్నారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కె.వి. రమణాచారి మాట్లాడుతూ- అల్లాణి శ్రీ్ధర్ ఒక మంచి సంకల్పంతో ఈ చిత్రాన్ని రూపొందించాడు. భగవంతుడి సినిమా విడుదల చేయడానికి భవంతుడే ఒక మంచి సంకల్పంతో ముందుకు వచ్చాడు. మన పురాణాలు.. మన సంస్కృతిని ప్రతిబింబించే ఇలాంటి సినిమాలు రావలసిన అవసరం ఉంది. ఒక మంచి సినిమా తీశాడు కాబట్టి ఈ సినిమా విడుదలకు నోచుకొని 50వ రోజు వైపు ప్రయాణిస్తోంది. ఈ సినిమాను రూపొందించిన అల్లాణి అభినందనీయుడు. అలాగే ఈ సినిమా విజయోత్సవ కార్యక్రమానికి కథానాయకుడు సాయికుమార్ బెంగళూరు నుండి అదే పనిగా రావడం ఆనందదాయకం అన్నారు. చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధాన పూజారి అయిన డా. పి.రంగరాజన్ మాట్లాడుతూ - ఏడు కొండలవాడు గోలుకొండకు రావడం అనే ఇతి వృత్తంతో తీసిన ఈ సినిమా భావి తరాల వారికి విలువలు నేర్పే కర్తవ్యంగా అనుకోవచ్చు. ఇది ఒక సేవగా భావించవచ్చు. మంచి విలువలు ఉండే ఈ సినిమా విడుదల చేయడానికి దోహదపడ్డ తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు. ఈ సినిమాలో మాధవరెడ్డి పాత్రలో జీవించాడు. చిన్న సినిమాలను ప్రోత్సహిస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఇలాంటి ఒక మంచి సినిమాను తీసిన దర్శకుడు అల్లాణి శ్రీ్ధర్‌ను అభినందిస్తున్నాను. దర్శకుడు అల్లాణి శ్రీ్ధర్ మాట్లాడుతూ - నేను ఈ సినిమాను తీయాలని అనుకోగానే నాకు ముందు గుర్తుకు వచ్చిన వ్యక్తి సాయికుమార్. ఆయన అయితేనే ఈ పాత్రకు సరిపోతాడు అనుకున్నాను. ఆయన ఎక్కువగా ఆవేశం గల పాత్రలను చేశాడు. ఈ సినిమాలో భక్తి పాత్ర అయినా అందులో కూడా అర్థవంతమైన ఆవేశం ఉంది. సినిమాను తీయడం చాలా సులువు అనిపిస్తుంది. కానీ దాన్ని మార్కెటింగ్ చేసుకోగలగటమే చాలా కష్టం. ఈ సినిమా విడుదల కావడానికి ప్రధాన కారణం కె.వి. రమణాచారి గారే. ఆయన ఐసియులో ఉండే మా సినిమాకు ఆక్సిజన్ ఇచ్చి బతికించారు. మేము అడగ్గానే దిల్ రాజు, రామసత్యనారాయణ ఈ సినిమాను విడుదల చేశారు. ఈ సినిమాను వారు ఎలాంటి లాభాపేక్ష లేకుండా విడుదల చేశారు. ఈ సినిమాను స్కూల్ పిల్లలు విపరీతంగా చూస్తున్నారు. ఎన్నో వ్యయప్రయాసలతో రూపొందించిన ఈ చిత్రం విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడటం మాకు చాలా ఆనందంగా వుంది అన్నారు. ఈ కార్యక్రమంలో సినిమా ఎగ్జిబిటర్ డా. వారణాసి రామచందర్, కార్యక్రమ నిర్వాహకులు వంశీరామరాజు, రామసత్యనారాయణ, వడ్డేపల్లి కృష్ణ, కృష్ణవేణి తదితరులు మాట్లాడారు.