రవితేజతో మరోసారి..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందాల చందమామ కాజల్ ఈమధ్య సినిమాలు తగ్గించినట్టు కనిపిస్తోంది. రానాతో చేసిన నేనే రాజు నేనే మంత్రి తరువాత ఆమె మరే చిత్రంలో కన్పించడంలేదు. అటు తమిళంలో కూడా పరిస్థితి అలాగే వుంది. వరుసగా వస్తున్న పరాజయాలతోనే కాజల్‌కు అవకాశాలు తగ్గాయని వార్తలు వస్తున్నాయి. అందుకే కాస్త గ్యాప్ తీసుకుని సన్నబడ్డ కాజల్, మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. తాజాగా ఈమెకు రవితేజ సరసన నటించే అవకాశం వచ్చిందట. ప్రస్తుతం టచ్ చేసి చూడు చిత్రంలో నటించిన రవితేజ, ఆ తరువాత కళ్యాణ్‌కృష్ణూ దర్శకత్వంలో నేల టికెట్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. దీంతోపాటు అటు శ్రీనువైట్లతో సినిమాకు ఓకె చెప్పాడు. ఈ చిత్రంలో రవితేజ మూడు పాత్రల్లో నటిస్తాడని, ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు వుంటారట. అందులో ఒక హీరోయిన్‌గా కాజల్‌ను ఎంపిక చేశారు. దాంతోపాటు నివేదా థామస్ కూడా ఎంపికైందని తెలిసింది. మరో హీరోయిన్ కోసం అనే్వషణ జరుపుతున్నారు. ఈ చిత్రానికి అమర్ అక్బర్ ఆంథోని అనే టైటిల్‌ను పెడుతున్నట్లు తెలిసింది. మొత్తానికి కాజల్ ఈ సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చే ప్రయత్నాలు చేస్తోంది.