నవ్వించే గోలీసోడా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎస్.బి. క్రియేషన్స్ పతాకంపై మానస్, నిత్యానరేష్, కారుణ్య హీరో హీరోయిన్లుగా మల్లూరి హరిబాబు దర్శకత్వంలో భువనగిరి సత్య సింధుజా నిర్మిస్తున్న చిత్రం ‘సోడా గోలీసోడా’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో నిర్మాత సత్య సింధుజ మాట్లాడుతూ- మా చిత్రానికి సెన్సార్ క్లీన్ యు సర్ట్ఫికెట్ వచ్చింది. పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రంగా ఉంటుంది అన్నారు. దర్శకుడు హరిబాబు మాట్లాడుతూ- వినోదాత్మక చిత్రాన్ని నిర్మించాలనే ఉద్దేశ్యంతోనే ఈ సినిమాను చేశాను. సోడా గోలీసోడా క్యాప్షన్‌గా ‘అంతా గ్యాసే’ పెట్టాం. ఈ సినిమా కోసం సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అన్నారు. హీరో మానస్ మాట్లాడుతూ- సీనియర్ కమెడియెన్స్ అందరూ ఈ చిత్రంలో ఉన్నారు. కుటుంబం మొత్తం ఆనందంగా చూసే చిత్రమిది. పాలకొల్లు, హైదరాబాద్ వంటి అద్భుతమైన లొకేషన్‌లలో చిత్రీకరించాం. తప్పకుండా ఈ సినిమాతో మాకు మంచి విజయం దక్కుతుంది అన్న నమ్మకం ఉంది. భరత్ అందించిన మ్యూజిక్ బాగా వచ్చింది. నాకింత మంచి చిత్రాన్ని ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం:్భరత్, కెమెరా:ముజిర్ మాలిక్, ఎడిటింగ్:నందమూరి హరి, సహనిర్మాత:్భవనగిరి శ్రీనివాస్, నిర్మాత:సత్య సింధుజ, దర్శకత్వం:మల్లూరి హరిబాబు.