మార్చి 1 నుండి థియేటర్లు బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డిజిటల్ ప్రొవైడర్ల విధి విధానాలవల్ల నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతున్నారని, ఈ విషయంపై ఇప్పటికే తెలుగు పరిశ్రమతోపాటు తమిళ, కన్నడ పరిశ్రమలు తీవ్రంగా వ్యితిరేకిస్తున్నాయి. డిజిటల్ ప్రొవైడర్స్ వసూలు చేస్తున్న అధిక ఛార్జీల వలన చాలా నష్టపోతున్నామని పలువురు నిర్మాతలు పేర్కొంటున్నారు. ఈ విషయమై ఇటీవల తెలుగు ఫిలిం నిర్మాతల మండలి, దక్షిణాది ఫిలిం ఛాంబర్స్ సమావేశమైంది. ఈ కార్యక్రమంలో డిజిటల్ ప్రొవైడర్ సర్వీసు వాళ్లు వసూలు చేస్తున్న అధిక ఛార్జీల వలన ఫలితం అందుకోవాల్సిన నిర్మాతలు అనవసరంగా నష్టాలకు గురవుతున్నారని, వాళ్లు అన్యాయంగా దోచుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. తక్కువ ధరకు వస్తున్న డిజిటల్ సర్వీసు వాళ్లను కొందరు కావాలని అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఈవిషయంపై డిఎస్‌పి సర్వీస్ వాళ్లు వారం రోజుల్లోగా తమ నిర్ణయం తెలపాలని, లేదంటే మార్చి 1 నుండి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని థియేటర్లను మూసివేస్తామని, అన్ని సినిమాల విడుదలను ఆపేస్తామని నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షులు పి.కిరణ్, సెక్రటరీ రామదాసు, శివప్రసాదరావు, తెలంగాణ ఛాంబర్ అధ్యక్షుడు కె.మురళీమోహన్, సునీల్ నారంగ్, ఎల్.సురేష్, రవి, తమిళ ఛాంబర్ అధ్యక్షుడు విశాల్ కృష్ణన్, కర్ణాటక ఛాంబర్ సెక్రటరీ సురేష్, కేరళ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు విజయ్‌కుమార్‌లతోపాటు సయ్యద్ కొక్కెర, సురేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.