ఎన్టీఆర్ కోసం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందమూరి బాలకృష్ణ నటించే తాజా చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే 102వ చిత్రంగా ‘జై సింహా’తో మంచి విజయాన్ని అందుకున్న బాలయ్య, తన 103వ చిత్రంగా ఎన్‌టిఆర్ బయోపిక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. మహానటుడు నందమూరి తారకరామారావు జీవితకథతో తెరకెక్కే ఈ సినిమాకోసం స్క్రిప్ట్‌తోపాటు ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాపై బాలయ్య సీరియస్‌గా ఉన్నారట. ఎన్టీఆర్ జీవితంలోని విశేషాలతో అద్భుతంగా చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మరో సినిమా గురించి ఆలోచించడంలేదని తెలిసింది. ఇప్పటికే పలువురు దర్శకులు బాలకృష్ణతో సినిమాలు చేయడానికి సిద్ధంగా వున్నారు. కానీ ఎన్టీఆర్ బయోపిక్ చేసిన తరువాత మిగతా సినిమాలపై ఫోకస్ పెట్టాలని ఆయన భావిస్తున్నారని తెలిసింది. ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. తేజ దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమాలో పలు పాత్రల కోసం ప్రముఖ నటీనటులను దింపేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక వివరాలు వెలువడే అవకాశం వుంది.