24 నుండి మల్టీస్టారర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగులో మొదలైన మల్టీస్టారర్ సినిమాలకు మంచి క్రేజ్ దక్కుతోంది. ఇప్పటికే మల్టీస్టారర్ చేయడానికి పలువురు హీరోలు సిద్ధంగా వున్నారు. ప్రస్తుతం నాగార్జున-నానిల కాంబినేషన్‌లో ఓ క్రేజీ మల్టీస్టారర్‌కు రంగం సిద్ధమైంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ నిర్మిస్తారని తెలిసింది. ఇప్పటికే నాగార్జునకు, నానిలకు కథ చెప్పి ఒప్పించిన దర్శకుడు ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తిచేశాడు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కే ఈ చిత్రంలో నాగార్జున డాన్‌గా కన్పిస్తాడని సమాచారం. నాని ఇందులో డాక్టర్‌గా కన్పిస్తాడట. ఇప్పటికే ఈ సినిమా కోసం హీరోయిన్ల ఎంపిక జరుగుతోందని, ఈ నెల 24న ఈ చిత్రం మొదలుకానున్నదట. త్వరలోనే చిత్రాన్ని పూర్తిచేసి సమ్మర్ కానుకగా విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. త్వరలోనే అధికారిక వివరాలు వెలువడే అవకాశం వుంది.