కొత్త దర్శకుడితో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరుస పరాజయాలతో సతమతమైన రాజశేఖర్‌కు కొంత గ్యాప్ తరువాత చేసిన ‘గరుడవేగ’ మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ సినిమా రాజశేఖర్ కెరీర్‌లో మంచి వసూళ్లను అందించింది. దాంతో మళ్లీ స్పీడ్ పెంచిన రాజశేఖర్ వరుస సినిమాలతో బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన గోపీ అనే కొత్త దర్శకుడితో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు. దర్శకుడు చెప్పిన కథ బాగా నచ్చడంతో సినిమా చేస్తానని స్క్రిప్ట్ సిద్ధం చేయమని సదరు దర్శకుడికి చెప్పాడట. ఇప్పటికే ఈ సినిమాపై నమ్మకంతో వున్న రాజశేఖర్, ఈనెల 4న దానికి సంబంధించిన వివరాలను ప్రకటిస్తారని తెలిసింది. గోపీ గతంలో మణిరత్నం దగ్గర పలు చిత్రాలకు అసోసియేట్‌గా పనిచేశాడట. త్వరలోనే సెట్స్‌పైకి రానున్న ఈ చిత్రం కోసం మిగతా తారాగణానికి సంబంధించిన ఎంపిక మొదలైంది.