సినిమాలే జీవితమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొత్తానికి గ్లామర్ భామ శృతిహాసన్ వ్యవహారం చూస్తుంటే సినిమాలకు ఫల్‌స్టాప్ పెట్టేలా కన్పిస్తోంది. ఈ మధ్య ఎన్ని అవకాశాలు వస్తున్నా కూడా నో చెబుతోంది. ప్రస్తుతం కమల్‌హాసన్ నటిస్తున్న శభాష్ నాయుడు సినిమా ఒక్కటే చేసింది. దాదాపు ఏడాది కాలంగా ఖాళీగా ఉంటున్న ఈ అమ్మడు ఈ విషయంపై స్పందిస్తూ.. ఈమధ్య సినిమాలు చేయడం లేదని అందరూ అడుగుతున్నారు. దానికి సమాధానం ఒక్కటే.. నా జీవితంలో సినిమాలే కాదు.. వేరే పనులు కూడా చాలా ఉన్నాయి. అందులో సినిమాలు ఒక భాగం మాత్రమే అంటూ చెప్పింది. ప్రస్తుతం శృతి హాసన్ ఓ మ్యూజిక్ ఆల్బం చేసే పనిలో బిజీగా మారింది. దాంతోపాటు ఓ విదేశీయుడితో జోరు ప్రేమాయణం సాగిస్తోన్న ఈ భామ ఇకముందైనా సినిమాలు చేస్తుందా? లేదా? అన్నది చూడాలి!