పాటల్లో వాడేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శివ తాండేల్, నేహా దేశ్‌పాండే జంటగా సాయి సునీల్ నిమ్మల దర్శకత్వంలో నిర్మాణి ఫిలింస్ పతాకంపై మణిలాల్ మచ్చి అండ్ సన్స్ నిర్మిస్తున్న చిత్రం ‘వాడేనా?’. ఈ చిత్రంలోని పాటలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ప్రముఖ దర్శక నిర్మాత ఎన్.శంకర్ పాటలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాత రాజ్ కందుకూరి, ధృవ్, సాయి సునీల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్.శంకర్ మాట్లాడుతూ- పాటలు, ట్రైలర్ అద్భుతంగా ఉన్నాయి. టైటిల్ కూడా ఆసక్తి కలిగిస్తోంది. ఇలాంటి ఇంట్రెస్ట్‌ను టైటిల్లో చూపిస్తే తప్పకుండా ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతుంది. ఈ చిత్రం మంచి విజయం సాధించి దర్శక నిర్మాతలకు మంచి లాభాలు తేవాలి అన్నారు. మరో నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ- ఈ సినిమా సైలెంట్‌గా వచ్చి పెద్ద హిట్ కొట్టేలా ఉంది. తప్పకుండా మంచి విజయం సాధించాలి అన్నారు. దర్శకుడు సాయి సునీల్ మాట్లాడుతూ- నూతన నటీనటులతో చేస్తున్న ప్రయత్నమిది. నేను ఏ దర్శకుడి దగ్గరా పనిచేయలేదు. నాకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తులు ఎన్.శంకర్, రాజ్ కందుకూరి. అందుకే వీళ్లను ఈ వేడుకకు ఆహ్వానించాను. మంచి కంటెంట్ వున్న సినిమా ఇది అన్నారు. నిర్మాత మాట్లాడుతూ- సినిమా బాగా వచ్చింది. త్వరలోనే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదల చేస్తామన్నారు.