ఈక్షణమే మొదలైంది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనని క్రియేషన్స్ పతాకంపై అనురాగ్‌ను హీరోగా పరిచయం చేస్తూ సాయిదేవ రామన్ దర్శకత్వంలో పోకూరి లక్ష్మణాచారి నిర్మిస్తున్న చిత్రం ‘ఈక్షణం’. ఈ చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. శే్వత హీరోయిన్. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ క్లాప్‌కొట్టగా జడ్జి రామారావు కెమెరా స్విచ్చాన్ చేశారు. అనంతరం నిర్మాత మాట్లాడుతూ- మా బ్యానర్‌లో తెరకెక్కుతున్న మొదటి చిత్రమిది. ఈ చిత్రానికి కథే ప్రధాన బలం. హీరోగా పరిచయం అవుతున్న అనురాగ్‌కు ఈ చిత్రం మంచి గుర్తింపునిస్తుంది అన్నారు. దర్శకుడు రామన్ మాట్లాడుతూ- మంచి ప్రయత్నంగా చేస్తున్న చిత్రమిది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామన్నారు. సంపూర్ణేష్‌బాబు మాట్లాడుతూ- మంచి కథతో వస్తున్న ఈ టీమ్ సక్సెస్ అవ్వాలి అన్నారు. ఈ చిత్రానికి కెమెరా:సతీష్, పాటలు:అనంత్ శ్రీరామ్, మాటలు:హేమంత్ కార్తీక్, నిర్మాత:లక్ష్మణాచారి, దర్శకత్వం:సాయిదేవ రామన్.