‘దండుపాళ్యం-3’ పాటలు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొమ్మాళి రవిశంకర్, పూజాగాంధీ, మకరంద్ దేశ్‌పాండే, రవికాలే ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం దండుపాళ్యం. ఈ గ్యాంగ్‌కి కన్నడలో మంచి క్రేజ్ వుంది. ఆ క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని దర్శకుడు శ్రీనివాసరాజు సహజంగా తెరకెక్కించారు. అలా చేసిన దండుపాళ్యం 1, దండుపాళ్యం 2 భారీ ఓపెనింగ్స్‌తో సూపర్ సక్సెస్ సాధించాయి. విభిన్నమైన కథాంశంతో, సహజమైన సన్నివేశాలతో, భావోద్వేగమైన నటనతో దండుపాళ్యం చిత్రం ద్వారా ఆ గ్యాంగ్‌కి సపరేట్ క్రేజ్ సంపాదించుకున్నారు. శ్రీనివాసరాజు దర్శకత్వంలో రూపొందిన ఈ సెనే్షనల్ చిత్రం మరొక్కసారి తెలుగు ప్రేక్షకుల్ని థ్రిల్ చేయనుంది. ఈ చిత్రాన్ని శ్రీవాడపల్లి వెంకటేశ్వర క్రియేషన్స్ వారు తెలుగులో విడుదల చేస్తున్నారు. శ్రీనివాస్ మీసాల, సాయి కృష్ణ పెండ్యాల సంయుక్తంగా తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ‘ఎక్కడికిపోతావు చిన్నవాడా’ దర్శకుడు వి.ఐ.ఆనంద్, ప్రముఖ నిర్మాత మల్కాపురం శివకుమార్ ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరోయిన్ పూజాగాంధీ మాట్లాడుతూ- శ్రీనివాసరాజు చెప్పిన కథ, కథనం నచ్చి ఈ దండుపాళ్యం చేశాను. కాని ఆయన వరుసగా మూడు పార్టులు చేశారు. ఇప్పుడు మా గ్యాంగ్ అందర్నీ దండుపాళ్యం గ్యాంగ్ అంటున్నారు. పార్టు 3 కూడా మంచి విజయం సాధిస్తుంది అని నమ్ముతున్నాను అన్నారు. వి.ఐ.ఆనంద్ మాట్లాడుతూ- ఇలాంటి చిత్రాలు తీయాలంటే అందరివల్లా కాదు. దానికి ఎంతో ధైర్యం కావాలి. దర్శకుడు శ్రీనివాసరాజు మొదటి పార్టుతోనే తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఆయన మూడు పార్టులు తీసి సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్నాడంటే మామూలు విషయం కాదు. నిర్మాతలు మాట్లాడు తూ- మహానుభావుడు, ఆనందోబ్రహ్మ, ఒక్క క్షణం లాంటి సూపర్‌డూపర్ హిట్ చిత్రాల్ని పంపిణీ చేశాం. ఈ సంవత్సరం ‘దండుపాళ్యం-3’తో నిర్మాతగా సినీరంగ ప్రవేశం చేశాం. దర్శకుడు శ్రీనివాసరాజు కమిట్‌మెంట్ కథని కన్విన్స్ చేసే విధానం చాలా బాగుంది. ప్రేక్షకులు థ్రిల్‌గా ఫీలవుతారు. చివరిపార్టుగా వస్తున్న దండుపాళ్యం-3 మార్చిలో విడుదల కానుంది. తప్పక మంచి విజయాన్ని సాధిస్తుందన్న నమ్మకం ఉంది అన్నారు.